Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి

Congress

Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి

Congress: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సహం  తెచ్చింది . తెలంగాణలో కాంగ్రెస్ కు ఆదరణ లేదని పార్టీ వీడిన నేతలు తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా మారిన తెలంగాణ పొలిటికల్ గేమ్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అయితే  కర్ణాటకలో కాంగ్రెస్ భారీ ఘన విజయం సొంతం చేసుకోవడంతో  తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీటవుతోందంటూ హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలు మారిన నేతలు అంతా  మళ్లీ సొంత గూటికి చేరుకుంటారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also watch

TS Inter: జూన్‌ 12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈ క్రమంల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాం రాం చెప్పి.. మళ్లీ సొంత గూటికి వచ్చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నల్గొండ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు తన ముఖ్య అనుచర వర్గంతో చర్చలు చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది.

బీజేపీలోనే కొనసాగాలా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లాలా అన్న విషయమై రాజగోపాల్‌ మూడు రోజులుగా చర్చలు చేస్తున్నారు.

కాంగ్రెస్ లోకి వెళ్లటానికి రాజగోపాల్ రెడ్డికి ఎక్కడా అడ్డంకులు ఉండవు.

కానీ, ఝార్ఖండ్‌లో తన కంపెనీకి రూ.18వేల కోట్ల టెండర్‌ దక్కడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్తే తాను తిరిగి కాంగ్రె్‌సలో చేరే విషయమై ఆలోచిస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం.

అని కొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.అయితే  జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్‌ కూడా పడిపోతున్నదని వివరించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేశారు.

అయితే, బీజేపీ దయాదాక్షిణ్యాలతోనే తనకు టెండర్‌ దక్కిందన్న ఆరోపణలను రేవంత్‌ వెనక్కు తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్తే అప్పుడు కాంగ్రె్‌సలో చేరే విషయమై ఆలోచించవచ్చునని రాజగోపాల్‌ అనుచరులు చెబుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh