Fireworks: పశ్చిమ బెంగాల్ లో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
Fireworks: పశ్చిమబెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు.
ఈస్ట్ మిడ్నాపూర్ లోని ఈగ్రాలోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం అక్కడి నుంచి బూడిద రంగు పొగలు కనిపించాయి.
పేలుడు బాధితులను ఆదుకునేందుకు స్థానికులు పరుగులు తీశారు.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. . గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Watch
అయితే సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ పేలుడు కేవలం అక్కడ నిల్వ ఉంచిన పటాకుల వల్ల జరిగిందా లేదా బాణసంచా ఫ్యాక్టరీలో తయారు చేసిన ముడి బాంబులు పేలడం వల్ల జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అవసరమైన అనుమతి లేకుండా బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా అక్రమ పద్ధతిలో నడుస్తోందని స్థానికులు ఆరోపించారు.
ఈ పేలుడు కేవలం అక్కడ నిల్వ ఉంచిన పటాకుల వల్ల జరిగిందా? లేదా బాణసంచా ఫ్యాక్టరీలో తయారు చేసిన ముడి బాంబులు పేలడం వల్ల జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక, అవసరమైన అనుమతి లేకుండా బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా అక్రమ పద్ధతిలో నడుస్తోందని స్థానికులు ఆరోపించారు.
ఈ ప్రాంతంలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేసినా స్థానిక యంత్రాంగం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఈగ్రా పేలుడు ఘటనను బెంగాల్ సీఐడీ తన ఆధీనంలోకి తీసుకుంది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
‘ఎగ్రాలో పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఫ్యాక్టరీ యజమానిని గతంలోనే అరెస్టు చేశారు.
ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ లభించింది. మళ్లీ అక్రమంగా తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.
యజమాని ఒడిశాకు పారిపోయాడు’ అని మమతా బెనర్జీ తెలిపారు.బెంగాల్ సీఐడీ ఈగ్రా కేసును చేపట్టిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.