Dog Attack on Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్‌పై కుక్క దాడి
Dog Attack on Arjun Tendulkar: ఐ పీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో కీలక మ్యాచ్‌కు సిద్దమైన ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది.
ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచింది. బౌలింగ్ వేసే చేతి వేళ్లనే కొరకడంతో అతను నేడు(మంగళవారం) జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కుక్క కరిచిన విషయాన్ని అర్జున్ టెండూల్కరే తెలిపాడు. దీంతో మే 16వ తేదీన లక్నోతో ఆడాల్సిన మ్యాచుకు అర్జున్ టెండూల్కర్ దూరమయ్యాడు.
Also Watch
ఐపీఎల్ 2023లో భాగంగా మే 16వ తేదీన లక్నోతో ముంబై ఇండియన్స్ తలపడబోతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు లక్నో వేదికలో ప్రాక్టీస్ చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు యుధ్‌వీర్ సింగ్, మోహ్‌సిన్ ఖాన్‌లతో అర్జున్ టెండూల్కర్ మాట్లాడాడు.
ముందుగా ఆటగాళ్లకు హగ్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఎలా ఉన్నారని ప్రశ్నించాడు. బాగున్నామంటూ అర్జున్ బదులిచ్చాడు.
అయితే నువు ఎలా ఉన్నావని అడిగారు. తనకు కుక్క కరిచిందని అర్జున్ సమాధానం ఇచ్చాడు. దీంతో లక్నో ప్లేయర్ కుక్క కరించిందా..ఎప్పుడూ అంటూ ఆశ్చర్యంగా అడిగారు.
నిన్ననే అంటూ అర్జున్ సమాధానం చెప్పాడు. ఈ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులంతా గెట్ వెల్ సూన్ అర్జున్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలరైన 23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. లోయర్ ఆర్డర్‌లో హిట్టింగ్ కూడా చేయగలడు. అయితే.. 2021 నుంచి ముంబయి ఇండియన్స్ జట్టుతోనే అతను ఉన్నా.. ఆడే ఛాన్స్ మాత్రం అతనికి దక్కలేదు.
ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ. 20లక్షల కనీస ధరతో వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత 2022లో వేలానికి వదిలేసినా.. మళ్లీ రూ.30 లక్షల ధరకి కొనుగోలు చేసింది. అర్జున్ కోసం ఆ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కూడా బిడ్ వేసింది. కానీ ముంబయి వదల్లేదు.
ఐపీఎల్ 2021, 2022 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుతోనే అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. కానీ.. అతడ్ని రిజర్వ్ బెంచ్‌కే ముంబయి టీమ్ మేనేజ్‌మెంట్ పరిమితం చేసింది.
కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కూడా మైదానంలోకి పంపే ప్రయత్నం చేయలేదు. అయితే.. ఐపీఎల్ 2023లో ముంబయి టీమ్‌కి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు.
అలానే జోప్రా ఆర్చర్ కూడా గాయంతో మ్యాచ్‌లు ఆడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రానికి మార్గం సుగుమమైంది.
Mumbai se aaya humara dost. 🤝💙 pic.twitter.com/6DlwSRKsNt
— Lucknow Super Giants (@LucknowIPL) May 15, 2023