Thailand Gambling Case: ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్

Thailand Gambling Case

Thailand Gambling Case: థాయ్‌లాండ్ క్యాసినో ఘటన.. ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్

Thailand Gambling Case: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్   ఈడీ విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో కలిసి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.   క్యాసినో కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది.

చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది.  పట్టాయ అధికారులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా రూ.

వంద కోట్ల వరకూ గ్యాంబ్లింగ్  నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు.  క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మను నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడించిందనేది ఆ కేసులో ఈడీ ప్రధాన అభియోగం.

అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకొని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సారి మొత్తం గుట్టు ఈడీ బయట పెట్టే అవకాశం ఉంది.

Also Watch

Bhavaneswari and Nara Lokesh: 100వ రోజు పాదయాత్ర లో

ఇటీవల థాయ్‌లాండ్‌లోని ఓ స్టార్ హోటల్‌లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరుపరిచారు.

ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగిన అనంతరం చికోటి ప్రవీణ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దీంతో వారం క్రితం చికోటి థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు.

ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన   83 మంది భారతీయులకు కూడా  థాయ్‌లాండ్‌  కోర్టు బెయిల్ ఇచ్చింది.  4500 బాట్స్  జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది.

జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు  కూడా ఇచ్చేశారు.  అయితే నాలుగు రోజులు ఫోకర్ టోర్నమెంట్ ఉంటుందని, ఆ టోర్నమెంట్ లీగల్ అని చెప్పడంతో తాను థాయ్‌లాండ్ వెళ్లినట్లు చికోటి చెబుతున్నాడు.

థాయ్‌లాండ్ క్యాసినో ఘటన..

థాయిలాండ్‌లో ఫోకర్  లీగల్ అని తనకు లేఖ కూడా పంపారని, అందులో స్టాంప్‌లు కూడా పంపారని చికోటి ప్రవీణ్ చెబుతున్నాడు.

థాయిలాండ్‌లో ఫోకర్ ఇల్లీగలని తనకు తెలియదని అంటున్నాడు. కొన్ని దేశాల్లో ఫోకర్ టోర్నమెంట్‌కి లీగల్‌గా పర్మిషన్ ఉన్నాయని చెబుతున్నాడు.

థాయ్‌లాండ్‌లో తాను క్యాసినో నిర్వహించలేదని, ఒక ప్లేయర్‌లా ఈవెంట్‌కి వెళ్లానన్నాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు లీగల్‌గా వందకుపైగా స్థానాల్లో క్యాసినో నడిపే స్థలాలు ఉన్నాయని చికోటి ప్రవీణ్ తెలిపాడు.

అయితే  హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ వెళ్లడానికి ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఖర్చుల నిమితం రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ప్రవీణ్ పై ఆరోపణలు ఉన్నాయి.

వారిని అక్కడకు తీసుకెళ్లి గ్యాంబ్లింగ్ నిర్వహించినట్టు..పక్కా సమాచారంతో క్యాసినో ఆడుతుండగా పట్టుకున్నారు. దీనితో పోలీసులు చీకోటి ప్రవీణ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.

కానీ తనకు ప్రాణ హాని ఉందని చీకోటి ప్రవీణ్  ఇప్పటికే పోలీసులను ఆశ్రయించాడు. తనకు తన కుటుంబసభ్యులను ప్రాణ హాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని..

గన్ మెన్స్ ను కేటాయించాలని పోలీసులను కోరాడు.

అలాగే గతంలో తన ఇంటి వద్ద కొంతమంది రెక్కీ నిర్వహించారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. అప్పటి నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రవీణ్  చెప్పుకొచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh