Groom Dies : పెళ్లింట సందడి.. అంతలోనే ఊహించని ఘటన
Groom Dies : పెళ్లిబాజాలు, బంధుమిత్రులతో కళకళలాడాల్సిన ఇంట్లో రోదనలతో విషాదం అలుముకుంది. ఈ ఘటన మహబూబాబాద్ మండలం లక్ష్మిపురం(బి) శివారు కొమ్ముగూడెంతండాలో గురువారం జరిగింది.ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది. అయితే , స్థానికులు తెలిపిన వివరాల మేరకు
.. తండాకు చెందిన భూక్య బాలాజీ, కాంతి దంపతుల కుమారుడు భూక్య యాకూబ్(22) ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఒప్పంద విధానంలో రైల్వే కోచ్ పెయింటర్‌గా పని చేస్తున్నారు. రెండు నెలల కిందట గార్ల మండల గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.
శుక్రవారం అర్ధరాత్రి 2.25 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. పది రోజుల కిందట యాకూబ్ ఇంటికి వచ్చారు. బంధువులు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఇల్లంతా సందడి నెలకొన్నది. అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో నీరు అయిపోవడంతో బోర్ మోటార్ స్విచ్ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోGroom Dies : ప్రమాదవశాత్తు షాక్‌కు గురై కిందపడిపోయాడు.
వెంటనే బంధువులు స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. శుకరువారం పెళ్లి కొడుకును చేసి వివాహం చేసేందుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలో యాకూబ్ మృతి తో తండాలో యాకూబ్ ఇంటితో పాటు వధువు ఇంట విషాదం అలుముకున్నది. యూకూబ్ మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అలాగే మరొక ఘటనలో మనుమరాలు పెళ్లి జరిగిన కొద్ది సేపటికే తాత మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన భువనగిరి పట్టణంలో నెలకొన్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణణలోని ప్రగతి నగర్‌కు చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నీలం రమేష్ తన ఏకైక కుమార్తె వివాహాన్ని గురువారం స్థానిక ఓ ఫంక్షన్హాల్లో వైభవంగా జరిపించాడు. అయితే కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న అతని తండ్రి, వధువు తాతైన విశ్రాంత ట్రాన్స్‌కో లైన్‌మన్ నీలం ఎట్టయ్య (85) ఆరోగ్యం వివాహం జరిగిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా విషమించింది
Groom Dies : . నూతన జంట ఫంక్షన్‌హాల్ నుంచి ఇంటికి వచ్చేందుకు సన్నద్ధం అవుతుండగా అతని ఆరోగ్యం క్షిణించడంతో వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే ఆసుపత్రిలోనే ఎట్టయ్య కన్ను మూశాడు. దీంతో నవ్వులు విరభూయాల్సిన పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. నూతన జంట ఫంక్షన్‌హాల్ నుంచే వరుడి ఇంటికి వెళ్లింది. పలువురు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.