Karnataka Polling: ఓటు హక్కును వినియోగించుకున్న సినీ,రాజకీయ ప్రముఖులు
Karnataka Polling:దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకిత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది.
మొత్తం 224 స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వీరిలో 2,427 మంది పురుషులు, 185 మంది మహిళలు ఉన్నారు. ఒకరు ఇతరుల కేటగిరీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం పర్వం ముగిసిపోవడంతో అభ్యర్థులు ఓటరు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయ్యాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా భాజపా , కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడుతున్నాయి. 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో జేడీఎస్ 207 అభ్యర్థులను నిలిపింది.
అయితే సెలబ్రిటీలు కూడా ముందుగానే తరలి వచ్చి కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. కన్నడ నటి అమూల్య తన భర్తతో కలిసి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే ఓటు వేసిన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ఎన్నికలు అనేది మీకు నిర్ణయించే హక్కు ఉన్న ప్రదేశం. కర్ణాటకను సుందరంగా తీర్చిదిద్దాలి. సామరస్యాన్ని కాపాడుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.
Also Watch
అలాగే కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థహళ్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత అందరూ కెమెరాలకు వేలి గుర్తును చూపించారు. షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓటు వేసే ముందు హుబ్లీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ తమ పార్టీ, కార్యకర్తలు, నాయకులు ప్రచారంపై చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసం ఉత్సాహంగా ఓటు వేయాలని కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నిర్మలా సీతారామన్ బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఇక్కడ ప్రజలు మూడ్ చాలా బాగుందని, ప్రజలు తన దగ్గరికి వచ్చి మాట్లాడిన తీరు వారు కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేస్తుందని అన్నారు.
కర్ణాటక పలితలాపై పార్టీల ఆతురత
అలాగే Karnataka Polling యడియూరప్ప మాట్లాడుతూ షికారిపుర నుంచి తొలిసారి బరిలోకి దిగిన విజయేంద్ర 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఓటు వేసిన అనంతరం చెప్పారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తితో కలిసి ఉదయాన్నే బెంగళూరులోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చుని ఓటేశారు.
ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ తాము ఈ వయసులో ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నామని, తమ నుంచి నేర్చుకుని యువత కూడా ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి రెండోసారి అధికారంలోకి రాలేదు. కర్ణాటకలోని మొత్తం ఓటర్లలో 17 శాతం లింగాయత్ లు, 15 శాతం మంది వొక్కలిగాలు, 35 శాతం ఓబీసీలు, 18 శాతం ఎస్సి/ఎస్టీలు, 12.92 శాతం ముస్లింలు, 3 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ లింగాయత్, వొక్కలిగాలు, ఓబీసీలు కీలకం కానున్నారు.