Minister KTR: మోదీ ఎవరికి, ఎందుకు దేవుడు

Minister KTR

Minister KTR: మోదీ ఎవరికి, ఎందుకు దేవుడు

Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించారు. ఈ పర్యటనలో బాగంగా కేటీఆర్‌  2.45 గంటలకు హెలికాప్టర్‌లో గోదావరిఖనికి చేరుకున్నారు. అక్కడినుండి రోడ్డు మార్గంలో 3 గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించి అనంరతం పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 4 గంటలకు రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరిo చారు.  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లు అధికారం ఇస్తే  ఏం పీకారని ప్రశ్నించారు. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్‌.

Also Watch

AP News: నేడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్

కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారని, అలాంటి కాంగ్రెస్ అధికారం ఇవ్వాలని అడుగుతుందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. అంతేకాకుండా.. ప్రధాని మోడీపైనా..బీజేపీ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. మోదీ దేవుడు అంటూ బీజేపీ నేతలు పొగిడేస్తుంటారు. కానీ మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా? అని ప్రశ్నించారు. అదానీకి మాత్రమే ప్రధాని మోదీ దేవుడు కానీ ప్రజలకు కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు అన్నీ అదానీకి కట్టబెట్టి మోదీ ఆదానీకి మాత్రమే దేవుడు ప్రజలకు కాదన్నారు.

తర్వాత  పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. గోదావరిఖని – రామగుండం మధ్య పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలో 29 ఎకరాల స్థలంలో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించారు.

Leave a Reply