BCCI: ఐపీఎల్ 2023 ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై

BCCI

BCCI: ఐపీఎల్ 2023 ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్

BCCI: లక్నోలో జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ గొడవ విరాట్ కోహ్లీ తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. లక్నో ప్లేయర్లు నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ తో కూడా వాగ్వాదానికి దిగాడు.  అసలు కెరీర్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీలో ఈ దూకుడు కనిపిస్తోంది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో క్యాచ్ పట్టినా, వికెట్ పడినా అరుస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాడు విరాట్ కోహ్లీ.. ఈ సెలబ్రేషన్స్ కారణంగా కొన్ని మ్యాచుల్లో జరిమానా కూడా చెల్లించాడు. అయితే నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేయడంతో పాటు అతన్ని ‘నువ్వు నా బూటుకి అంటిన మట్టితో సమానం’ అనే అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ చేసిన సైగలు వివాదాస్పదం అయ్యాయి. దీన్ని నవీన్ వుల్ హక్, పర్సనల్‌గా తీసుకోవడమే కాకుండా ‘నన్ను అంటే నా వాళ్లందరినీ అన్నట్టే’ అంటూ వ్యాఖ్యానించాడు.

దీంతో అప్పటిదాకా విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా అతనిని తప్పుపట్టడం మొదలెట్టారు.  భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ చేసింది తప్పేనంటూ కామెంట్లు చేశారు.

ఈ విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, నవీన్ వుల్ హక్‌ని కలిసి అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీశాడు.

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ సభ్యులతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కూడా చాలా సేపు చర్చించాడు. అసలు ఏం జరిగింది? విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడు? నిజంగానే జాత్యాంహంకార వ్యాఖ్యలు చేశాడా? అనే కోణంలో బీసీసీఐ దర్యాప్తు జరుపుతుంది.అయితే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh