Chhattisgarh Accident: ఘోర రోడ్డు ప్రమాదం
Chhattisgarh Accident: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధామ్తరి జిల్లాలో మే 03 బుధవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారులో కుటుంబం బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-30పై బలోద్లోని జగ్త్రాకు చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారి బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు మహిళలు, ఓ బాలిక, నలుగురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో చిన్నారితో పాటు పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ కు తరలించాం. ప్రమాదం జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం’’ అని బలోద్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ఈ దుర్ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బీహార్లోనూ బుధవారం సాయంత్రం ఇలాంటి ప్రమాదమే జరిగింది. సీతామర్హిలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఓ వివాహ వేడుకకు హాజరై ఆటోలో కుటుంబ సభ్యులు, బంధువుల కలిసి వస్తున్నారు. అయితే మగోల్వా ప్రాంతానికి చేరుకునే సరికి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను సీతామర్హిలోని జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లామని ఎస్డీవో ప్రశాంత్ కుమార్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
अभी अभी सूचना मिली है कि बालोद के पुरूर और चारमा के बीच बालोदगहन के पास शादी कार्यक्रम में जा रही बोलेरो और ट्रक के बीच भिड़ंत में 10 लोगों की मृत्यु हो गई है एवं एक बच्ची की स्थिति गंभीर है।
ईश्वर दुर्घटना में दिवंगत आत्माओं को शांति एवं उनके परिवारजनों को हिम्मत दे। घायल बच्ची…
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 3, 2023