Hyderabad Rains: తెలంగాణ లో ఈ రోజు భారీ వర్షం పడే అవకాశం: వాతావరణశాఖ
Hyderabad Rains : హైదరాబాద్ తోపాటు తెలంగాణ లోని ఇతర జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరదనీరు చేరడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యధికంగా గాజులరామారాంలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట, బార్కస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడా తదితర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సంతోష్‌నగర్, సైదాబాద్, సరూర్‌నగర్, సికింద్రాబాద్, చిలకలగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, రాణిగంజ్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడక్కడ భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి.
ఈ క్రమంలో నగరంలో అక్కడక్కడ ఈ ఉదయం నుంచి స్వల్ప వర్షం కురుస్తోంది. సాయంత్రం లేదా రాత్రి నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. Hyderabad Rainsలో ఈ రోజు ఉదయం నుంచి చల్లని వాతావరణం ఏర్పడింది. నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై కనిపిస్తుంది.
ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దక్షిణ దిశ నుంచి గాలి వేగం గంటకు 06 నుంచి 10 కి.మీ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.8 డిగ్రీలు నమోదైంది. గాలిలో తేమశాతం 085 శాతంగా ఉండగా.. వర్షపాతం 002.6 మిల్లీమీటర్లు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
రానున్న కొద్దిరోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కర్ణాటక, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ దోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.