కోడెల శివప్రసాద్ చావుకు కారణం చంద్రబాబే : అంబటి
Ambati Rambabu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్ ప్లాప్ షో అని విమర్శించారు. జనం రాకపోయిన మహా అద్భుతం అని అంటున్నారని మండిపడ్డారు. . 50 వేల మంది పట్టే మైదానంలో కేవలం 2, 3 వేల మంది వచ్చారని, వారినే ఎక్కువ చేసి చూపించి సక్సెస్ అని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ముసలి సైకో అని అధికారం లేకపోతే బతకలేడని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. తిట్టినవారిపై కూడా ప్రశంసలు కురిపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు. కోడెల శివప్రసాద్ మరణానికి తాను కారణమని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
అయితే కోడెల శివప్రసాద్ చావుకు కారణం ముమ్మాటికీ చంద్రబాబేనని Ambati Rambabu స్పష్టం చేశారు. కోడెల శివప్రసాద్ స్వర్గస్తులు అయినారని ఆయనపై ప్రస్తుతం తాను విమర్శలు చేయదలుచుకోవడం లేదని అన్నారు. అలాంటి అంశాలు అవసరమైనప్పుడు మాత్రమమే మాట్లాడతానని చెప్పారు. అయితే అసలు ఆ పార్టీలో బాబుకంటే కోడెల సీనియర్ అని, ఆత్మహత్యకు ముందే ఓసారి నిద్రమాత్రలు మింగితే కోడెలను కనీసం ఫోన్ లో పరామర్శించడానికి కూడా బాబు అయిష్టత చూపారని వెల్లడించారు. ఆ కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి బాబేనని తేల్చి చెప్పారు. కోడెల తమ రాజకీయ ప్రత్యర్థి అని, పదవిలో ఉన్నప్పుడు ఆయన అక్రమాలపై చట్టపరంగా కేసులు పెట్టామని, అంతే తప్ప ఆయన చావుకు బాధ్యత తమది కాదన్నారు.
తనను ఆంబోతు అని బాబు సంబోధించడంపై Ambati Rambabu ఘాటుగా స్పందిస్తూ ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన చరిత్ర ఉన్న నేత బాబు అంటూ ధ్వజమెత్తారు. బాబు, లోకేష్, కోడెల కంటే తాను నిజాయితీపరుడినేనన్నారు. తన తమ్ముడు నియోజకవర్గంలో కనబడకపోవడం చిదంబర రహస్యం అంటూ బాబు చేసిన విమర్శలపై కూడా రాంబాబు సమాధానమిస్తూ బాబు తమ్ముడు, ఒకసారి ఎమ్మెల్యే కూడా అయిన రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.