TTD: భక్తులకు, ముఖ్యంగా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు….

TTD

TTD: శ్రీవారి భక్తులకు తీపి కబురు, ముఖ్యంగా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు….

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ  తీపి కబురు అందించింది.  జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు TTD  ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ  ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

వీటితో పాటుగా  ఏప్రిల్ 25వ తేదీన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జులై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపింది. TTD అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.

అయితే కరోనా ప్రభావం తగ్గడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. అదే సమయంలో TTDకూడా భక్తుల రాకను బట్టి శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవా టికెట్లను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనును్నారు. వేసవి రద్దీని పరిగణలోకి తీసుకొని వీటిని విడుదల చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ ద్వారా ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh