CHIRAMJIVI:మెగాస్టార్ గ్యారేజీలో మరో కొత్త లగ్జరీ కారు, ఖరీదు ఎంతో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో మరో లగ్జరీ కారు వచ్చిచేరింది. అత్యంత ఖరీదైన ఈ కారు అద్భుతమైన పీచర్స్ తో మతి పోగొట్టేలా ఉంది. రీసెంట్ గా రిజిస్టేషన్ చేయించడంతో పాటు.. ఫ్యాన్సీ నెంబర్ కూడా ఇచ్చారు ఆర్టీఏ అధికారులు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో ఎన్నో అద్భుతమైన పీచర్స్ కలిగిన లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం అందులోకి మరో కారు వచ్చి చేరింది. ఆ అత్యాధునిక లగ్జరీ కారు పేరుది టొయోటా వెల్ఫైర్. రీసెంట్ గా ఈ కారును కొనుగోలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో ఇష్టంగా ఈ కారును కొన్నారు మెగాస్టార్. రాజసం ఉట్టిపడే ఈ కార షోరూం ధర, లైఫ్ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయలు అని సమాచారం.
మెరుపులు మెరిపించే బర్నింగ్ బ్లాక్ కలర్ తో చూడగానే కళ్లు మిరుమిట్లుగొలిపేలా ఉన్న ఈకారు చూసేవారికి కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక ఈ కారుకు సబంధించిన రిజిస్టేషన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్-1 నంబర్ కేటాయించారు. అంతే కాదు మంచి ఫ్యాన్సీ నంబర్ కూడా సాధించారు మెగాస్టార్. దానికోసం 4.70లక్షలు ఖర్చు పెట్టారు చిరంజీవి. టీఎస్09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్ స్వయంగా వచ్చారు.
కొణిదెల చిరంజీవి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీఓ రామచంద్రం మెగాస్టార్ కు దగ్గరుంచి కావల్సిన ఏర్పాట్లు చేశారు. ఆయన సమక్షంలో ఫొటో, డిజిటల్ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారుచిరు. ఇక ఈకారు ఫీచర్స్ తెలిస్తే మతి పోవాల్సిందే. టొయోటా నుంచి రిలీజ్ అయిన ఈ కారు అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా కలిగి ఉంది. హైస్పెసిఫికేషన్స్‌తో విడుదలైన ఈ మల్టీపర్పస్ వెహికిల్‌లో ఏడుగురు ప్రశాంతంగా కూర్చునే విధంగా సీట్ సిస్టం ఉంది. అంతే కాదు మధ్యలో ఉన్న సీటు వీఐపీ సీట్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అంతే కాదు ఇందులో కూర్చునే ఏడుగురు వ్యక్తులకు ప్రమాదం జరిగినప్పుడు కాపాడటానికి ఏడు ఎయిర్ బ్యాక్స్ కూడా ఉండటం విశేషం ఇందులో ఈ వాహనం బర్నింగ్ బ్లాక్, వెల్ఫైర్ పెరల్ వైట్, గ్రాఫైట్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ తో నడిచే ఈ కారు. లీటర్ కు 16.35 కిలో మీటర్లు వస్తుంది. ఇక వీటికి ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్ ఉండటం తో పాటు.. 2.5 పెట్రోల్ ఇంజిన్ మరో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉన్నాయి.
అలాగే మెగాస్టార్ మూవీ విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ ప్రస్తుతం తదుపరిచిన భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా 50% వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు మెగాస్టార్. ఇక అదే ఊపుతో మరికొన్ని ప్రాజెక్టులకు కూడా సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.. చిరంజీవి తదిపరి సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.