PROSTITUTE:షాద్‌నగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
షాద్‌నగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహంపై దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.ఈ ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది.
షాద్‌నగర్‌లోని హజీపల్లి రోడ్డు శ్రీనివాసకాలనీలో నాగర్‌కర్నూల్ జిల్లా ఇంద్రకల్ తండాకు చెందిన ఓ మహిళ, ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనానికి చెంది న కమ్మరి వెంకటేశ్(24)లు ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.
కర్నూల్ చెందిన బాష వీరివద్దకు అమ్మాయిలను పంపుతూ సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాష నాలుగు రోజులు క్రితం ఓ అమ్మాయిని షాద్‌నగర్‌కు పంపించపాడు. ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సలీం.. తార, వెంకటేశ్‌కు సహాయకుడిగా ఉంటూ విటుల నుంచి డబ్బు వసూలు చేస్తుంటాడు. ఈనెల 9న బిహార్‌కు చెందిన హసనుల్లాఖాన్, ఫరూఖ్‌నగర్ గుండుగేరికి చెందిన శీలం సాయికుమార్ వద్ద .1,500 బేరాన్ని కుదుర్చుకున్నాడు. వ్యభిచార గృహానికి తీసుకువచ్చారు.
వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న షాద్‌నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఏసీపీ కుశాల్కర్ పర్యవేక్షణలో పట్టణ సీఐ నవీన్‌కుమార్ నేతృత్వంలో మెరుపు దాడి చేశారు. తార, వెంకటేశ్, సలీం, హసనుల్లాఖాన్, సాయికుమార్‌తో పాటు బాధిత అమ్మాయిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. వారి నుంచి 6 సెల్ఫోన్లు, రూ.12,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారందరినీ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. బాషా పరారీలో ఉన్నాడని తెలిపారు. బాషా పరారీలో ఉన్నాడని తెలిపారు.
అలాగే కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ నవీన్‌కుమార్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడంలో పోలీసులు పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కేసును ఛేదించిన వారికి రివార్డులు అందజేస్తామని డీసీపీ తెలిపారు.