MS Dhoni: ధోనీకి యువరాజ్‌దక్కనున్న మరో అరుదైన గౌరవం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన బ్యాటింగ్, కెప్టెన్సీతో భారతీయ జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. అంతేకాదు.. రూ.100 కోట్లకు పైగా భారతీయుల కలను నెరవేర్చిన హీరో కూడా ధోనీనే కావడం విశేషం. 2007లో టీ 20 ప్రపంచ కప్ తో సహా 2011 వన్డే ప్రపంచ కప్ ను భారత జట్టుకు అందించాడు. 28 ఏళ్ల తరువాత వన్డే ప్రపంచ కప్ అందించి భారతీయులు ఉప్పొంగేలా చేసాడు. 2011 ధోనీ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా సంబురాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది.
ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీరికి లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించుకుంది.
భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యూలైరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అన్యా శ్రుబ్‌సోల్, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆస్ట్రేలియాకు చెందిన రేచల్ హేన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్రఫే మోర్తాజా, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్, ఆమీ సాటరెత్‌వైట్, సౌతాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లను ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చి గౌరవించింది.
ఈ నేపథ్యంలో ధోనిని గౌరవించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో ఎం.ఎస్. ధోనీ సిక్స్ కొట్టి టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ ను అందించాడు. ఆ అపురూప క్షణాలను ఏ భారతీయుడు కూడా ఇప్పటికీ మరువలేరు.
ప్రపంచ కప్ ఫైనల్ కి వేదిక అయిన ముంబై వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ధోనీ ఫినిషింగ్ సిక్స్ కొట్టగా బంతి ఏ సీటులో పడింతో ఆ సీటుకు ధోనీ పేరు పెట్టనున్నట్టు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు.
ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్ లో సీటుకు ధోనీ పేరు పెట్టనున్నారు. కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అందుకున్న ధోని, యువరాజ్, రైనా భారత్ 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించిన జట్టులో సభ్యులు కాగా మిథాలీ రాజ్ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎంసీసీ చివరిసారిగా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. నాడు ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, సౌతాఫ్రికాకు చెందిన జాక్ కల్లిస్, భారత్‌కు చెందిన హర్భజన్ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది.