టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో భారీ ట్విస్ట్

TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో భారీ ట్విస్ట్.. ఏకంగా 15 పేపర్లు లీక్

తెలంగాణలో  రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించిన  వెలుగు చూసిన పేపర్‌ లీకేజ్‌ కేసు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో పలు పరీక్షలు రద్దు కాగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కూడా రద్దయ్యింది. ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఎందుకంటే మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయటికి వస్తున్నాయి.

తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవాహారంపై ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున​ వ్యతిరేకత ఉండటం, విపక్షాలు విమర్శలు చేస్తుండటంతో సిట్‌ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను లోతుగా ప్రశ్నించి వారి వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా సిట్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో

గ్రూప్ 1, AE, AEE, JL, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ విభాగాల్లో మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం  అధికారులు చెబుతున్నారు.  ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ కుమార్, ఏ2గా ఉన్న టీఎస్‌పీఎస్సీ నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు అరెస్ట్ చేసిన మరో 13 మందిని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ లీక్ వ్యవహారం నడుస్తోన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పేపర్‌ ప్రవీణ్‌తో పాటు సురేష్, రమేష్‌, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్, ప్రశాంత్‌ రెడ్డికి మాత్రమే లీక్ అయినట్లు చెబుతున్నారు. వీరికి తప్ప ఇంకెవరికి గ్రూప్-1 పేపర్ లీక్ అయినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ స్పష్టం చేసింది.

అయితే  ఆల్రెడీ జరిగిపోయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించిన మెయిన్స్ పరీక్షల పేపర్ల కోసం కూడా బేరసారాలు జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. ఐతే మెయిన్స్ పేపర్లు లీక్ అవ్వకముందే.ఈ స్కామ్ బయటపడింది. ఇప్పటికే నిందితులందరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

దీన్ని బట్టీ చూస్తే TSPSCలో ప్రశ్నాపత్రాలకు అసలు సెక్యూరిటీయే లేదని అనుకోవచ్చనిపిస్తోంది. రోడ్డు పక్కన పకోడీ, బజ్జీల మాదిరిగా ప్రశ్నాపత్రాలను ఇష్టమొచ్చినట్లు లీక్ చేసి అమ్ముకున్నట్లు అర్థమవుతోంది. ఇలా అభ్యర్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేంటని అంతా ప్రశ్నిస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh