తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయనున్న రాహుల్ గాంధీ

ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం నోటీసులు జారీ అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాహుల్ ఆ నోటీసులపై స్పందించారు. ఆ నోటీసులకు కట్టుబడి తాను ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు రాహుల్. ఈ మేరకు పార్లమెంట్ సెక్రటరీకి రాహుల్ లేఖ రాశారు. ఏప్రిలో 23లోగా తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి సోమవారం నోటీసులు అందాయి. ఈ క్రమంలోను తాను ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన సభ్యునిగా, నేను ఇక్కడ గడిపిన ఆనందకరమైన జ్ఞాపకాలకు ప్రజల ఆదేశానికి రుణపడి ఉన్నాను’ అని రాహుల్ గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

‘నా హక్కులకు భంగం కలగకుండా, నేను మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను’ అని రాహుల్ చెప్పారు. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన అనంతరం రాహుల్‌ గాంధీకి తుగ్లక్‌ వీధిలోని 12 నంబర్‌ బంగ్లాను కేటాయించారు. అయితే ఇప్పుడు అనర్హతకు గురైనందున ప్రభుత్వ నివాస గృహంలో ఉండటానికి అర్హుడు కాడని ఆ అధికారి వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హత పొందిన తేదీ నుంచి నెల రోజుల్లో తన నివాస భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై సూరత్ కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ గాంధీ ప్రకటన మొత్తం మోడీ వర్గాన్ని కించపరిచేలా ఉందని.. మోడీ వర్గం పరువు తీశారని ఆయన ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 (పరువు నష్టం) కింద కేసు నమోదు అయింది. రాహుల్ గాంధీ ర్యాలీలో ఉద్దేశ పూర్వకంగా చేశారంటూ ఆయన ప్రసంగం సీడీలను పూర్ణేష్ మోడీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 202 ప్రకారం న్యాయ ప్రక్రియను అనుసరించనందున.. ప్రొసీడింగ్‌లు మొదటి నుంచి లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. అక్టోబర్ 2021లో రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని సూరత్ కోర్టుకు నమోదు చేసింది. రెండు పక్షాల వాదనాలు విన్న కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

కోర్టు జైలు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దవుతుందని ప్రచారం జరిగింది. అనుకున్నట్లు ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘పిరికి, నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. బీజేపీ చీకటి పనులను తాము బహిర్గతం చేస్తున్నందున కక్ష కట్టిందన్నారు. రాజకీయ దివాళా తీసిన మోదీ ప్రభుత్వం.. ఈడీ, పోలీసులతో దాడులు చేయిస్తోందంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రసంగాలపై కేసులు వేస్తుందన్నారు. హైకోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ అనర్హత అంశంపై  న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు. తాము మౌనంగా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదానీ స్కామ్‌పై జేపీసీ వేయాలని కోరితే రాహుల్ గాంధీని  అనర్హత వేటు వేశారంటూ ఫైర్ అయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh