భారత్‌ కు టెన్షన్‌ తెస్తున్న భూటాన్‌ ప్రధాని షాకింగ్‌ కామెంట్స్

ఆరేళ్లుగా డోక్లామ్‌ అంశంపై భారత్‌, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనాతో భూటాన్ సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాల్సిన సమయం వచ్చిందా అనే చర్చ, భూటాన్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలనే వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో కనిపించాయి. భారత ప్రభావం నుంచి భూటాన్ బయటపడాలనే వాదనలూ వినిపించాయి.ఈ నేపథ్యంలో భూటాన్‌ ప్రధాన మంత్రి లోటే షెరింగ్‌ చేసిన వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్‌లో పడేశాయి. ఇంతవరకు చైనా ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే.ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ అన్నారు.

దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్‌, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చింకుందాం. అయినా మూడు సమాన దేశాలే. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా అని అన్నారు. ఒకరకంగా భూటాన్‌ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతమిచ్చింది. కాగా, భారత్‌, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతమే డోక్లాం. దీన్ని ట్రై జంక్షన్‌ అని కూడా పిలుస్తారు. ఐతే ఈ ఎత్తైన పీఠభూమి(డోక్లాం) సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. సరిగ్గా చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది.

దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్‌ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్‌ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్‌ పాయింట్‌ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏమి చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది.

దశాబ్దాలుగా ఈ ట్రై జంక్షన్‌ పాయింట్‌ అంతర్జాతీయ పటంలో బటాంగ్‌ లా ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం చైనాకి ఉత్తరాన, భూటాన్‌కి ఆగ్నేయం, భారత్‌కి పశ్చిమాన ఉంది. అయితే చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్‌ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కి.మీ దూరంలో ఉన్న మౌంట్‌ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం చైనాలో భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. చైనా 2017 నుంచి డోక్లాం విషయంలో వెనక్కి తగ్గినట్లే తగ్గిడోక్లాం వెంబడి నేరుగా తూర్పున భూటాన్‌ భూభాగంలో ఉన్న అమోచు నది లోయం వెంబడి విస్తరించే యత్నం చేసింది.

ఈ భూటాన్‌ భూభాగం గుండా అనేక గ్రామాల మధ్య చైనా రహదారిని నిర్మిచింది. తద్వారా భూటాన్‌ తన భూభాగాన్ని చైనా అప్పగించవలసి వచ్చిందన్న అక్కసుతో ప్రధాని షెరింగ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భూటాన్‌ భూభాగంలోకి చైనా చొరబడిందని పలు వార్తలు వచ్చినప్పటికి భూటాన్‌ దాన్ని ఖండిస్తూ ఎలాంటి చొరబాటు జరగలేదని సమర్థించుకుంది. పైగా చైనా దొంగతనంగా ఆక్రమించిన భూభాగాలను భూటాన్ ప్రాంతాలు కాదని భూటాన్ వాదిస్తోందని భారత్‌ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు డాక్టర్ బ్రహ్మ చెల్లానీ అన్నారు. భూటాన్, చైనాలకు ఉత్తరం, పశ్చిమం వైపున ఉన్న భూభాగాల విషయంలో వివాదాలున్నాయి. భూటాన్‌లోనే ఒక వర్గం చైనాతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది.

రాజకీయ విశ్లేషకులు కర్మా టెన్‌జిన్ మాట్లాడుతూ- ”వీలైనంత తొందరగా చైనాతో ఒప్పందం చేసుకోవాలనేది నా భావన. ఆ తర్వాత దౌత్యపరంగా ముందుకు సాగవచ్చు. లేకపోతే ఈ డోక్లాం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతూ ఉంటుంది” అని తెలిపారు. ”భూటాన్ లాంటి శాంతిని ప్రేమించే దేశం ముంగిట రెండు శక్తిమంతమైన దేశాలు ఒకరితో ఒకరు తలపడడం మంచిది కాదు” అన్నారు.

థింపూలో నేను కొందరితో మాట్లాడగా, భారత్ కొంచెం ఓపిక పట్టి ఉంటే డోక్లాం ప్రతిష్టంభనను నివారించి ఉండొచ్చని వాదించారు. చైనాతో భూటాన్‌కు సుదీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారంపై ఈ పరిణామం ప్రభావం చూపొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.

దక్షిణాసియా దేశాలైన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లలోకి చైనా చొచ్చుకుపోతుండటాన్ని భారత్ నిలువరించలేకపోతోంది. ఈ ప్రాంతంలో భూటాన్ మాత్రమే చైనాతో దౌత్య సంబంధాలు లేని దేశం. భారత్ తమ సహజ వనరులను దోపిడీ చేస్తోందని భూటాన్‌లోని కొన్ని వర్గాల వారు భావిస్తున్నారు. భారత్ ‘పెద్దన్న’ తీరు కారణంగా చైనాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని అనుకొంటున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh