ఆపదలో ఉన్న అభిమానికి అండగా నిలిచిన స్టైలిష్ స్టార్
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఏ రేంజలో వాడుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే దీంతో హీరోలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు హీరోలు చేసిన ఏ విషయాలు బయటకు పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం క్షణాల్లో సోషల్ మీడియా లో చక్కెరలు కొడుతుంది. ఇక సాయం చేసి బయటకు చెప్పుకోని హీరోలు ఎంతో మంది ఉంటారు వారిలో ఒకరే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆపద కాలంలో అభిమానిని ఆదుకుని వారికి అండగా నిలుస్తున్నాడు బన్నీ. కష్టాల్లో ఉన్న అభిమానికి సాయం అందించి తన గొప్ప మనసు చాటుకున్నడు స్టైలిష్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. కష్టంలో ఉన్న తన అభిమాని కోసం ముందుకొచ్చి సాయం అందించారు. వాళ్లకు కావాల్సిన ఆర్థిక సాయం అభిమాని కుటుంబంలో సంతోషం నింపారు. అర్జున్ కుమార్ అనే అల్లు అర్జున్ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ట్రీట్ మెంట్ కోసం దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుండగా, ఆ కుటుంబానికి అంత ఆర్ధిక స్థోమత లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
తమ క్లబ్ సభ్యుడు ఒకరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటూ పోస్ట్ పెట్టారు. అలా అలా ఈ మ్యాటర్ అల్లు అర్జున్ దాకా చేరడంతో ట్రీట్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోమని, దాన్ని తాను చెల్లిస్తానని అన్నారు. నాకు సాయం చేసిన నా హీరో అల్లు అర్జున్‌కి థాంక్స్. మీరు చేసిన సాయానికి నా వంతుగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియ జేసుకోవాలనుకుంటున్నాను అని సాయం పొందిన అల్లు అర్జున్ అభిమాని ఆనందం వ్యక్తం చేశాడు. అభిమాని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలియగానే స్పందించి సాయం చేసిన అల్లు అర్జున్‌ని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్. మరో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే తర్వాత సినిమా పుష్ప 2 సెట్స్ మీదకొచ్చి శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట. ఈ పుష్ప 2 కి సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న విషయాలు బన్నీ అభిమానుల్లో జోష్ తో నింపుతున్నాయి. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా పక్కా ప్లాన్ చేసిన సుకుమార్. ఈ పుష్ప 2 సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
https://twitter.com/ArjunKumar_AAA/status/1623727393390362624?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1623727393390362624%7Ctwgr%5E45512f5ddc416ab6295b5870ce1656a5255bc258%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fwhats-n
ఇది కూడా చదవండి :