కల్లుగీత కార్మికులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికుల కోసం ఏపి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. 2022 నుంచి 2027 వరకు కల్లు గీత గీత పాలసీని తీసుకొచ్చింది. ఈవృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. ఈపాలసీతో రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా పాలసీని రూపొందించారు.
అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా.. మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
Pawan Kalyan: జనసేన పార్టీ కార్యక్రమాలకు గెటప్ మార్చిన పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నట…
Ambati Rambabu: :వచ్చే అసెంబ్లీ ఎన్నికల టికెట్ పై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా వచ్చ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. వచ్చే…