Read more about the article Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.
Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం.... విపక్షాలు సైతం విమర్శలు.

Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.

Sr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం.... విపక్షాలు సైతం విమర్శలు.   Sr Ntr-నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లు ఆమోదించుకుంది. చంద్రబాబు కంటే తనకే ఎన్టీఆర్ అంటే గౌరవం ఉన్నదని సభలో చెప్పుకున్న జగన్, ఈ సందర్భాన్ని చంద్రబాబుమీద ఎదురుదాడికి, ఆడియోలూ వీడియోల ప్రదర్శనకు సభా సమయాన్ని వాడుకున్నారు. తాను ఓ పక్క Sr Ntrపేరు చెరిపేస్తూనే, కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని నిలదీస్తున్నారు. తెలుగుప్రజలంతా అన్నగా ఆరాధించే నందమూరి తారకరామారావుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అవమానం తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీలతోనూ, ప్రాంతాలతోనూ నిమిత్తం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యపై ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. పిదపకాలం ముంచుకొస్తే పెడబుద్ధులు పుడతాయని పెద్దలు అంటారు. జగన్మోహన్ రెడ్డి అధికార ప్రస్థానమే వినాశనంతోనూ, కూల్చివేతలతో మొదలైంది. వ్యవస్థల నిర్మాణం కంటే కూల్చిందే ఎక్కువ కనుక నిర్మించడంలో ఉన్న కష్టం ఆయనకు తెలియదు. చరిత్ర తెలియనివారే ఇటువంటి విధ్వంసాలకు పాల్పడతారు. అప్పట్లో మెడికల్ కాలేజీలు ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉంటూ, అల్లర్లు ఆందోళనల వంటి పలు కారణాలతో పరీక్షలు వాయిదాపడుతూ, నకిలీ సర్టిఫికేట్ల సమస్యతోనూ, అర్హులైన బోధకులు లేక వైద్యవిద్య పతనమైన స్థితిలో, దేశంలోనే తొలిసారిగా ఎన్టీరామారావు పూనిక వహించి ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అన్ని దేశీయ వైద్యవిధానాలనూ, పారా మెడికల్ కోర్సులనూ ఈ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర వైద్యవిద్యకు విలువనూ, సాధికారతనూ సమకూర్చారు. పటిష్టమైన చట్టాలతో మెడికల్ కాలేజీలను ఇలా ఆయన ఓ దారికి తెచ్చిన వెంటనే తమిళనాడు అనుసరించింది, మిగతా రాష్ట్రాల్లోనూ హెల్త్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ మానసపుత్రిక. ఆయన ముందుచూపునకు నిదర్శనం. తెలుగుగడ్డమీద వేలాదిమందిని నైపుణ్యం గల వైద్యవిద్యార్థులుగా తీర్చిదిద్ది, అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకొనేట్టు చేసింది. అందువల్లనే, ఆయన మరణానంతరం Sr Ntr పేరు పెట్టినందుకు తెలుగుప్రజలంతా సంతోషించారు. అటువంటి మహనీయుని పేరును నిష్కారణంగా తొలగించడం ఉన్మాదం కాక ఇంకేమిటి? రాష్ట్రంలో సాగుతున్న విద్వేషపూరిత పాలనకు పరాకాష్ఠ ఈ నిర్ణయం. వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యరంగంలో చేసిన కృషిని ఎవరూ కాదనడం లేదు. ఇప్పటికే గత పథకాలన్నింటి పేర్లూ చెరిపేసి, ఆయా వృత్తులతో సంబంధం లేకున్నా వైఎస్ఆర్ పేరు పెట్టారు. కొన్ని పథకాలకు జగనన్న తోక తగిలించుకున్నారు. చివరకు అంబేడ్కర్‌నూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు సంస్థలమీదా, వ్యవస్థలమీదా పడ్డారు. ఒక కొత్త సంస్థను సృష్టించి తండ్రిపేరో, తనపేరో పెట్టుకోవచ్చు, ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వినూత్న వ్యవస్థలను…

Continue ReadingSr Ntr-ఎన్టీఆర్ కి ఘోర అవమానం…. విపక్షాలు సైతం విమర్శలు.
Read more about the article sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..
sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..

sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..

sachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..   sachin tendulkar-భారతదేశానికి క్రికెట్ ఒక మతం అయితే. ఆ మతానికి ఏకైక దేవుడు సచిన్ టెండుల్కరే. టీమిండియాలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ సచిన్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు అంటే చాలు. సచిన్.. సచిన్.. అన్న హోరు సముద్రపు అలల హోరు కంటే ఎక్కువగా వినిపించేది. అయితే sachin tendulkar రిటర్మైంట్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ అతడిలో మాత్రం ఆ కళాత్మకమైన క్లాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. భారత్ వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కేవలం 5.5 ఓవర్లే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరిగింది 5.5 ఓవర్లే అయినప్పటికీ ఈ గేమ్ లో సచిన్ కళాత్మక ఆటకు ఫ్యాన్స్ మాత్రం ఫిదా అయ్యారు.రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా 12వ మ్యాచ్ ఇండియా లెజెండ్స్-న్యూజిలాండ్ లెజెండ్స్ మధ్య ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియాంలో జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ లెజెండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మెుదటి నుంచే ఎదురుదాడికి దిగింది. సచిన్ తో ఓపెనర్ గా జతకట్టిన నమన్ ఓజా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.   https://youtu.be/0qhPpHIBfpY   ఓజా 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి షేన్ బాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 3.5 ఓవర్లకు 32/1. మరో ఎండ్ లో సచిన్ కూడా నేటి కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 13 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. రైనా (9)రన్స్ తో క్రిజ్ లో ఉండగా 5.5 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి భారత లెజెండ్స్ స్కోరు 5.5 ఓవర్లకు 49/1 తో నిలిచింది. sachin tendulkar- క్లాస్ బ్యాటింగ్.. అదేంటి సచిన్ కొట్టింది కేవలం 19 పరుగులే కదా? మీరేంటి సచిన్ క్లాస్ బ్యాటింగ్ అంటున్నారు అనుకుంటున్నారా! “అన్నం ఉడికిందా లేదా.. అని అన్ని మెతుకులు పట్టుకుని చూడాలా! ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిదూ” అన్నట్లుగానే. sachin tendulkar- ఒక్క షాట్ చూస్తేనే అతడి కళాత్మకమైన ఆట ఇంకా తగ్గలేదు అని మనకు తెలుస్తుంది. తాజాగా న్యూజిలాండ్ లెజెండ్స్…

Continue Readingsachin tendulkar-23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..
Read more about the article Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా
Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా

Balakrishna-నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన `నరసింహనాయుడు` సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి `మృగరాజు`, వెంకటేష్ `దేవి పుత్రుడు` సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన `నరసింహనాయుడు` సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్యకు సన్నిహితుడైన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి బాలయ్యను అభినందించడానికి వచ్చారు. మాటల సందర్భంలో ఇలాంటి సమయంలో ఓ జానపద చిత్రం చేస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఇద్దరు భావించారు.   https://youtu.be/bjeEfPjuF-4   ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్ చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. దర్శకుడుగా కోడి రామకృష్ణను అనుకున్నారు. ఈ సినిమాలో Balakrishna ప్రతాప వర్మ, విక్రమ సింహ భూపతి అనే రెండు క్యారెక్టర్లలో నటిస్తాడు. Balakrishna ఓ అడవిలో తన నానమ్మతో కలిసి ప్రతాప్ వర్మ క్యారెక్టర్ లో ఉంటాడు.అయితే కొందరు బందిపోటు దొంగలు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వస్తారు. ఆ సమయంలోప్రతాప వర్మను చూసి వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ప్ర‌తాప్‌వ‌ర్మ ఎవరో కాదు ఆ సామ్రాజ్యానికి యువరాజు. బాలయ్య తండ్రి విక్రమసింహా భూపతి ( సీనియ‌ర్ బాల‌య్య‌) ఆ సామ్రాజ్యానికి మహారాజు. అయితే కొందరు వెన్నుపోటు పొడిచి విక్రమసింహ భూపతిని చంపేస్తారు. అప్పుడు బాలయ్యను తీసుకుని అతడి నానమ్మ ఓ గూడేనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ వర్మ తన తండ్రి మరణానికి కారుకులైన వారిని అంతం చేసి తిరిగి రాజ్యాన్ని ఎలా ? దక్కించుకున్నాడు అన్న కథాంశంతో ఈ సినిమాను అనుకున్నారు.అయితే ఇందులో చాలా మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరోయిన్‌గా సీనియర్ బాలయ్యకు జోడిగా రోజాను ఎంపిక చేశారు. అలాగే జూనియర్ బాలయ్యకు జోడిగా టక్కరి దొంగ సినిమా హీరోయిన్ లీసారేతో పాటు పూజా పాత్రను అనుకున్నారు. అయితే లీసారే ప్లేస్ లోకి అంజలా జవేరి వచ్చి చేరింది. 2001లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2002 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. దాదాపు సగం వరకు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో రెండు పాటలు…

Continue ReadingBalakrishna-బాహుబలిని మించిన బాలయ్య పాన్ ఇండియా