Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. అక్కడ మందు షాపులు రెండు రోజు బంద్
ఇది మందు బాబుకువెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మరి ఎందుకంటే నేటి నుంచి రెండు రోజుల పాటు వైన్ షాప్‌లను మూసివేయనున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు.
మార్చి 11 ( శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 ( సోమవారం) సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్‌లను మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు అన్ని వైన్ షాపులను మూసివేయాలని.. ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారుబోనాలు, హోలీ వంటి పండగలతో పాటు ఎన్నికల సమయంలో కూడా మద్యం షాపులను మూసివేస్తారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ పండగ సందర్భంగా కూడా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే. మార్చి 6 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8 ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్‌లను మూసివేశారు. హైదరాబాద్ పరిది లోని మద్యం షాపులు రెండు రోజు మూతపడుతున్న తరుణంలో మద్యం షాపులకు మంచి గిరాకీ లబించింది. మందుబాబులతో షాపులు కిక్కిరిసిపోయాయి.
ఇది కూడా చదవండి :