Vivekananda: నేడు ఐదోసారి సీబీఐ ముందుకు

Vivekananda

Vivekananda: ఐదోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్

Vivekananda: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ నేడు విచారణకు హాజరుకావానలి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరవుతున్నారు. అయితే నేడు దీంతో అవినాష్ రెడ్డి  ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు బయలుదేరారు.

హైదరాబాద్ కు  ఏకంగా 10 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ప్రయాణం అయ్యారు. అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే అవినాష్ ను జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో సీబీఐ విచారణ చేసిన సంగతి తెలిసిందే.  సీబీఐ కూడా గతంలో మాదిరిగానే అవినాష్ విచారణ సమయంలో వీడియోలు, ఆడియో‌లు రికార్డ్ చేయనున్నారు. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇది ఐదోసారి కాగా కేసులో సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే  నిన్న (ఏప్రిల్ 16) తండ్రి భాస్కర్ రెడ్డిని Vivekananda కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేడు కుమారుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. Vivekananda హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.

Vivekananda: ఐదోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్

అయితే వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అధికారులు ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వివేకా అల్లుడిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అలాగే తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారుల విచారణ తీరు సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూస్తూ ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు అధికారుల తీరు గురించి సీబీఐ పెద్దలకు కూడా తెలియజేశామన్నారు.

అయితే పాత అధికారులు చేసిన తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని అన్నారు. తాము లేవనెత్తిన కీలక అంశాలపై వారు స్పందించడం లేదని వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా పట్టించుకోవడం లేదని వివరించారు. ఆయన చనిపోయినప్పుడు తానే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చానని హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన అల్లుడు పోలీసులకు ఈ విషయం చెప్పలేదని అన్నారు.

భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌ రెడ్డిని సహ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. Vivekanandaహత్య అనంతరం సహనిందితులు డి.శివశంకర్‌రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ఆధారాల్ని ధ్వంసంచేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగించింది. సమాచారం దాచిన వివేకా అల్లుడిని విచారించటం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని విమర్శించారు.

హత్య చేసి అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా కీలకంగా భావిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సీబీఐ అప్రూవర్ కు బెయిల్ ఇచ్చి సహకరించడం దుర్మార్గం అని అవినాష్ రెడ్డి కామెంట్స్ చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh