ప్రీతి మృతిపై సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు
కేఎంసీ పీజి మెడికో ప్రీతి మృతి కన్నా కూతుర్ని విగతజీవిగా చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటింది. గత అయిదు రోజులుగా నిమ్స్ మృత్యువుతో పోరాదిండి ప్రీతి .కానీ అసలు హైదరాబాద్ నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమెఆదివారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మృతితో యావత్ రాష్ట్రమంతా దిగ్ర్బాంతికి గురైంది. ఈ ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పనులు ముగిసిన తర్వాత అంబులెన్స్ ద్వారా వరంగల్‌కు బయలుదేరారు.
ప్రీతి మృతదేహంతోపాటు ఓ అటెండర్ అంబులెన్స్‌లో ఆమె కుటుంబసభ్యులను పోలీసు వాహనంలో తరలించారు. ప్రీతి డెడ్‌బాడీని సొంతూరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు తరలించారు. గిర్నితండాలో ప్రీతి కుటుంబానికి ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లారు కుటుంబ సభ్యులు. కానీ ప్రీతి కుటుంబానికి గిర్నితండాలో కొద్దిపాటి స్థలం ఉండటంతో డెడ్‌బాడీని అక్కడే ఉంచి ఆఖరి చూపు కోసం ఏర్పాటు చేశారు. ఈ రోజు (సోమవారం) ఆమె స్వగ్రామం మొండ్రాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రీతి మృతితో గిర్నితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రీతి మృతదేహం చూసి విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు. పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రీతిని వేధింపులకు గురిచేసిన నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మొండ్రాయి గిర్ని తండాలో పోలీసుల మోహరించారు.
ఆమె మృతిపై అటు మంత్రులు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి మృతిపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలిపార . ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందిన్నారు బండి సంజయ్. ప్రీతిది ఇది ముమ్మాటికీ హత్యే అని ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని. ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. అలాగే మరోప్రక్క ప్రీతి మృతిపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ఈ దురదుష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ కోరారు. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రీతి మరణం కలచివేసిందని అన్నారు. ప్రీతి మృతి వెనుక దాగి ఉన్న నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్ని కఠినచట్టాలు తీసుకొచ్చినా..కాలేజీల్లో వేధింపులు కొనసాగడం విచారకరమన్నారు సోము వీర్రాజు
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని.. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబంలో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి నుంచి ప్రత్యేక ఆర్థికసాయంగా మరో రూ. 20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి :