8 ఏండ్లలో రూ.4.46 లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి : KCR
KCR: సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోలేని కొందరు ఉచితాలంటూ అనుచితంగా మాట్లాడొచ్చుగానీ, సంక్షేమ కార్యక్రమాలు పేదల బతుకుల్లో వెలుగులు పూయిస్తాయి. వారికి కొండం త భరోసాను, ఆర్థిక ఆసరాను కల్పిస్తాయి. జీవ న స్థితిగతుల్ని మార్చడం ద్వారా ఆర్థికశక్తిని పెం చుతాయి. తద్వారా సమాజ పురోగతికి కారణమవుతాయి
అలాగే గ్రామాల్లో వ్యవసాయం రికార్డులు తిరగరాస్తోంది. సంక్షేమ పథకాలతో పల్లెల్లో స్థితిగతుల్లో మార్పు తెచ్చాయి. ప్రభుత్వం ఇస్తున్న భరోసా అందిస్తున్న ఆర్దిక ఆసరా మొత్తంగా గ్రామాల పురోగతికి తోడ్పాటు అందిస్తున్నాయి.
నేరుగా ప్రజల ఖాతాల్లోని నగదు జమ ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రజల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తం రూ 4.46 లక్షల కోట్లుగా ఉంది. అందులో ప్రధానంగా రైతుబంధు ద్వారా రూ 65,481కోట్లు, రైతు రుణ మాఫీ కోసం రూ 17,351 కోట్లు, ఆసరా ఫించన్లు రూ 57,650 కోట్లు, ఉపాధి హామీ కూలీ నిధులుగా రూ 27,825 కోట్లు అందించారు. వీటితో పాటుగా రైతుబీమా కింద రూ.5,384 కోట్లు, కల్యాణలక్ష్మి కింద రూ.8,182 కోట్లు,
షాదీముబారక్ కోసం రూ.1,902 కోట్లు, దళిత బంధు కోసం రూ 4,404 కోట్లు, ఆరోగ్య శ్రీ కింద రూ 8 వేల కోట్లు, KCR కిట్ కోసం రూ 1,420 కోట్లు అందించారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 70,965 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 37,779 కోట్లు అందచేసారు. ధాన్యం కొనుగోలు కోసం రూ 1,21,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 4,46,276 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.
మౌళిక వసతుల కోసం రూ 3.94 లక్షల కోట్లు:
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 4.46 లక్షల కోట్లు విడుదల చేయగా, మరో 3.94 లక్షల కోట్లు గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల పథకాల కోసం ఖర్చు చేసింది. దీంతో మొత్తంగా ఎనిమిదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో KCR ప్రభుత్వం రూ 8.41 లక్షల కోట్లు వెచ్చించింది. ప్రాజెక్టులతో సాగుకు నీటి కొరత తీరిపోయింది. విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయి. 8 ఏండ్లలో జీఎస్‌డీపీ సుమారు మూడు రెట్లు పెరిగింది. ‘ఎకరం అమ్మితే 20-30లక్షలు వస్తయి నాకేంది! నా కుటుంబానికి ఏం తక్కువైంది. నా కొడుకును, బిడ్డను మంచిగా చదివించుకుంటా.. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటా’ అనే ఆత్మవిశ్వాసం గ్రామీణుల్లో కనపడుతున్నది.
ఒకనాడు గ్రామీణ ప్రాంత ప్రజల్లో పదులు, వందలు చేతుల్లో ఉంటే మహాగగనం. అలాంటిది ఇప్పడు పల్లె జనాల్లో వేలు, లక్షలు చేతుల్లో తిరుగుతున్నాయి. కొద్దిపాటి భూమి ఉన్నవారు సైతం ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకున్నారు. పంట పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చడంతో అప్పుల రంది లేకుండా పోయింది.ఫలితంగా రికార్డు స్థాయి పంటలు పండుతున్నాయి. ఫలితంగా కొనుగోలు శక్తి పెరటంతో పాటుగా ఆర్దిక శక్తి బలోపేతం అయింది. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత పెరిగింది. నీతి అయోగ్ లెక్కల ప్రకారం వృద్ధి రేటు అయిదు రెట్లు పెరిగింది. గత మార్చితో ముగిన ఆర్దిక సంవత్సరానికి పెట్టుబడి వ్యవయం రూ 61,343 కోట్లకు చేరింది. ఒక అంచనా ప్రకారం.. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి తదనంతరకాలంలో సగటున 18 రెట్ల్ల ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తల మాట.