JOBS: దూరదర్శన్ లో.. నెలకు రూ.40 వేల జీతం

JOBS

JOBS: దూరదర్శన్ లో.. నెలకు రూ.40 వేల జీతం

JOBS: నిరుద్యోగులకు శుభవార్త ప్రసార భారతి దూరదర్శన్ న్యూస్ (DD News)లో పూర్తి సమయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీడియోగ్రాఫర్ పోస్ట్ కోసం అనుభవజ్ఞులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూరదర్శన్ JOBS 2023 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా JOBS దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం.

అయితే ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 18న ఈ ప్రకటనను prasarbharat.org వెబ్ సైట్లో ప్రచురించారు. ప్రకటన ప్రచురణ నుంచి 15 రోజులలోపు తమ ఫారమ్‌ను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ కోసం భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య దూరదర్శన్ భారతి ద్వారా మొత్తం 41 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం ₹ 40,000 జీతం ఇవ్వబడుతుంది. వ్యవధి రెండేళ్లు.

విద్యార్హత:

అయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2వ తరగతి అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. MOJO అనుభవం కూడా ఉండి షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సుకు హాజరైన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

అప్లికేషన్ లింక్:https://prasarbharati.gov.in/

అనుభవం:

వీడియోగ్రఫీ/సినిమాటోగ్రఫీ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి నోటిఫికేషన్ తేదీ నాటికి 40 సంవత్సరాలు ఉండాలి.

 

Leave a Reply