IPL2023 : గుజరాత్ టైటాన్స్‌ చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్

IPL2023

గుజరాత్ టైటాన్స్‌ చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్

IPL2023: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ IPL2023 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 32 బంతుల్లో 60 పరుగులు, షిమ్రాన్ హెట్‌మేయర్ 26 బంతుల్లో 56 పరుగులు చేయడంతో రాజస్థాన్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 4 విజయాలు సాధించింది. 8 పాయింట్లతో ఆ జట్టు IPL2023 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

178 పరుగుల లక్ష్యఛేదనలో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై రాజస్థాన్‌ విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది రాజస్థాన్‌ బ్యాట్స్‌ మన్‌హెట్మెయర్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. సంజూ విధ్వంసక బ్యాటింగ్‌ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ కేవలం 32 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. శాంసన్‌ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), జోస్‌ బట్లర్‌ (0) నిరాశపరిచారు. ధృవ్‌ జురెల్‌ 18, అశ్విన్‌ 10 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. IPL2023 లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో షమీ 3, రషీద్‌ ఖాన్‌ 2, హార్దిక్‌ పాండ్యా 1, నూర్‌ అహ్మద్‌ 1 వికెట్‌ తీశారు.

లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడి తలో మూడు విజయాలు సాధించాయి. ఈ మూడు జట్ల ఖాతాలో ఆరు చొప్పున పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న లక్నో రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానంలో, పంజాబ్ నాలుగో స్థానంలో నిలిచాయి.

ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. ఓ స్థానం ఎగబాకి పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. సన్‌రైజర్స్ 9వ స్థానంలో ఉండగా ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది.

ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల విషయానికి వస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 7.85 ఎకానమీతో 11 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 8.12 ఎకానమీతో 11 వికెట్లు తీసిన లక్నో బౌలర్ మార్క్ వుడ్, 8.3 ఎకానమీతో 11 వికెట్లు తీసిన గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh