కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. డిపాజిట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగుతుందని చెపుకోవచ్చు. ఇప్పుడు తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్లకు లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు అయితే 3.5 శాతం నుంచి 7.6 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచింది. కస్టమర్లు బ్యాంక్‌లో 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్ల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 21 నుంచి అమలులోకి వచ్చిందని బ్యాంక్ వెల్లడించింది.
దీంతో కస్టమర్లకు గతంలో కన్నా ఇకపై అధిక రాబడి లభించనుంది. 7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్డీలపై బ్యాంక్ 3 శాతం వడ్డీని అందిస్తోంది. 30 నుంచి 45 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి ఆరు నెలల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగా కొనసాగుతోంది. ఆరు నెలల నుంచి 9 నెలల వరకు టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. ఇంకా 9 నెలల నుంచి ఏడాది టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6 శాతం వడ్డీని ఇస్తోంది.
అలాగే సంవత్సరం నుంచి 15 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. అలాగే 15 నెలల నుంచి 18 నెలల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతంగా లభిస్తోంది. 18 నెలల నుంచి 21 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. 21 నెలల నుంచి పదేళ్ల వరకు కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. కాగా మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ స్కీమ్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీపై అయితే గరిష్గా 7.75 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ పరిమిత కాలం వరకే ఉంటుంది. మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది.
ఇది కూడా చదవండి :