Godra Train: కేసులో 8 మంది దోషులకు సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది.
Godra Train: 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా సమీపంలో జరిగిన రైలు దగ్ధం కేసులో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న నేరస్థులు అనుభవించిన శిక్షాకాలం, నేరంలో వారి పాత్రను పరిగణలోకి తీసుకుని 8 మంది దోషులకు సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో మరో నలుగురు దోషులకు నేరంలో వారి పాత్రను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది.
Godra Train దగ్ధం కేసుకు చెందిన దోషులు తీవ్ర నేరాలకు పాల్పడ్డారని గుజరాత్ ప్రభుత్వం సోమవారం హైకోర్టులో పునరుద్ఘాటించింది. రైలు బోగీకి బయట నుంచి గడియపెట్టి నిందితులు బోగీని తగలబెట్టారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈ కేసులో దోషులు ఇప్పటికే 17 ఏళ్ల శిక్షాకాలాన్ని అనుభవించారని దోషుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికే 17 సంవత్సరాల పాటు జైలులో శిక్షను పూర్తి చేసుకున్నారన్న కారణంపై 8 మంది దోషులకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఉప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈ 8 మందిని దోషులుగా నిర్ధారిస్తూ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించగా గుజరాత్ హైకోర్టు కూడా దీన్ని ధ్రువీకరించింది. కాగాఇదే కేసులో ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించగా తర్వాత గుజరాత్ హైకోర్టు దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చడంతో జైలులో శిక్షను అనుభవిస్తున్న దోషులు పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.
2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్కు చెందిన కొన్ని బోగీలను తగలబెట్టిన ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దరిమిలా గుజరాత్లో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి.Godra Train దగ్ధం కేసుపై విచారణ జరిపిన స్థానిక కోర్టు 31 మంది నిందితులను దోషులుగా తేల్చి 63 మందిని నిర్దోషులుగా పేర్కొంది.
వీరిలో 11 మందికి ఉరిశిక్ష, 20 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను స్థానిక కోర్టు విధించింది. అనంతరం గుజరాత్ హైకోర్టు దీనిపై తీర్పు ఇస్తూ 31 మందికి శిక్ష విధించడాన్ని సమర్ధించింది. అయితే 11 మందికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 నుంచి అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి నేడు తీర్పు వెలువడింది.