ట్విట్టర్ ఉద్యోగులకు ట్విస్ట్ ఇచ్చిన మస్క్
ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. ఈసారి 200 మంది ఉద్యోగులను తొలగించింది ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సంస్థ. ఇది ట్విట్టర్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు గురించి ఆదివారం రాత్రి సమాచారం ఇచ్చింది న్యూయార్క్ టైమ్స్. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను మస్క్ గతేడాది అక్టోబర్లోతన సొంతం చేసుకున్నారు . అప్పటినుంచి పలుమార్లు ఉద్యోగులు తొలగించగా లేటెస్ట్ రౌండ్ ఆఫ్ జాబ్ కట్స్‌లో 200 మందినితొలిగించారు
అయితే తాజా లేఆఫ్స్ గురించి ట్విట్టర్ నుంచి తక్షణమే ఎలాంటి స్పందనా లేదు. ఇక ట్విట్టర్లో ప్రస్తుతం మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉన్నట్లు మస్క్ ఇటీవల చెప్పారు. ట్విట్టర్ చివరిగా నవంబర్ ఆరంభంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న కొద్ది రోజుల్లోనే మస్క్ లేఆఫ్స్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఏకంగా 3700 మందిని పీకేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. లెక్కకు మించి అప్పట్లో ఉద్యోగులను నియమించుకున్నారని ఆరోపిస్తూ ఆదాయం తగ్గిపోయిందని ఇంత మందిని తీసేశారు. దీనిపై అప్పట్లో మస్క్ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇక ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటినుంచి మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో ఉద్యోగులకు టార్గెట్లు విధించారు. వీకాఫ్ లేకుండా రోజూ 12 గంటల చొప్పున పనిచేయాలని అల్టిమేటం జారీ చేశారు. తన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలువురు సామూహిక రాజీనామాలు చేయడం కూడా కలకలం రేపింది. అదే సమయంలో ట్విట్టర్ ఆఫీసులను తాత్కాలికంగా మూసివేశారు మస్క్. ఇక కొద్దిరోజులకు ఆ గొడవ సద్దుమణిగింది. లేఆఫ్స్‌లో భాగంగా భారత్‌లో ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించారు. ఇటీవల దిల్లీ, ముంబయిలో ట్విట్టర్ ఆఫీసులను కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా మాత్రమే ఒక ట్విట్టర్ ఆఫీస్ ఉంది.
ఇది కూడా చాడవండి :