AP POLITICS: టీడీపీ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో భేటీ అయిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము ఏ పార్టీ అజెండా కోసం పనిచేయం అన్నారు. కాపులు అధికారంలోకి వస్తే బీసీలు ,దళితులను తొక్కిస్తారు అనే విష ప్రచారం జరుగుతుందిఅని జనసేన నాయుకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు కాపులంతా ఒక్కటిగా ఉంటే అధికారం దానికదే వస్తుందని కాపులు ఒక్కతాటిపైకి వస్తే ఈ వ్యక్తి సీఎంగా ఉండడని పవన్ అన్నారు. 2024 ఎన్నికలు చాలా కీలకం నా సొంత డబ్బు పెట్టి పార్టీ నడిపిస్తున్నా అంతేగానీ నేను ఎవరిని కూడా విరాళాలు అడగలేదు. వాళ్లే ఇష్టంగా ఇచ్చారన్నారు టీడీపీ వాళ్లు 20 సీట్లకే జనసేనను పరిమితం చేశారని. సంకేతాలు ఇస్తున్నారు ఇక మరొకరు రూ.1000 కోట్లకు డీల్ అని మాట్లాడుతున్నారు. ఎవ్వరితోనూ లోపాయికారి ఒప్పందం చేసుకోనని పవన్ స్పష్టం చేశారు. కాపులకు సంఖ్యా బలం ఉందని కొంతమంది కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని పవన్ అన్నారు. బీసీ, ఎస్సి, కాపు కులాల్లో సంఖ్యా బలం ఉందని. కాకపోతే ఐక్యత లేదని అన్నారు. కుళ్లు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. తాను బయటకు మెత్తగా కనపడినా కానీ మెత్తటి మనిషిని కాదని పవన్ స్పష్టం చేశారు. తాను ఎవరి లోపాయికారి ఒప్పందాలకు లొంగిపోనని వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామని పవన్ అన్నారు కులాలను తగ్గించే హక్కు ఎవరికీ లేదు. జనసేనను నమ్మాలని ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని కూడా తాను తగ్గించనని జనసేనాని చెప్పుకొచ్చారు.
ఇది కూడ చదవండి: