Nitin Gadkari: వైజాగ్ పోర్ట్ 6 లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
Nitin Gadkari: ఏపీ కు పెట్టుబడలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి ఎందరో ఏపీలో రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకట్టారు.
అలాగే ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వైజాగ్‌పై వరాల జల్లు కురిపించారు. వైజార్ పోర్టుకు 6 లైన్ల హైవేకు సంబంధించిన మంత్రి కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా గడ్కారీ మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కొనియాడారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ చాలా రోజులుగా సీఎం జగన్ 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ నా ముందు ఉంచారు. ఈ రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుంది, ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 6300 కోట్లు కానుందని మంత్రి అన్నారు.ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సభా సమక్షంలో తెలిపారు. రాష్ట్ర అభివ్రుద్ధికి తన సహకారాన్ని అందించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Addressing Andhra Pradesh’s “Global Investment Summit (GIS 2023), Visakhapatnam https://t.co/v9OJs0qGYK
— Nitin Gadkari (@nitin_gadkari) March 3, 2023
ఇది కూడా చదవండి :
- రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన : ఏపీలో మరిన్ని పెట్టుబడులు
- యువతకు సందేశం ఇచ్చిన వెంకయ్యనాయుడు