మార్చి 14న మచిలీపట్నంలో భారీ సభ-వారాహిలోరానున్న పవన్
ఆంద్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఆవిర్బవించి 9 ఏళ్లు పూర్తిచేసుకుని . పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణాజిల్లా .మచిలీపట్నం ను వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండుసీట్లలోనూ ఓడిపోయారు. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను బందరులో ఘనంగా నిర్వహించడం ద్వారా జనసేన సత్తా చాటుకోవాలని నిర్ణయించారు. అంతే కాదు బందరుకు దీనికి వేదికగా చేసుకోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారీ ఆయనకు కౌంటర్లు ఇస్తున్న వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బందరులో సభ నిర్వహణ ద్వారా ఆయనకు కౌంటర్ ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాపు జనాభా ఎక్కువగా ఉన్న బందరులో సభ నిర్వహణ ద్వారా కృష్ణాజిల్లాలో పార్టీ పటిష్టానికి వాడుకోవాలనేది జనసేన ఆలోచన. అలాగే వంగవీటి రాధా జనసేనలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న సమయం లో ఆయన్ను బందరు నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనతో ఉన్న పార్టీ ఈ సభను అందుకు కూడా వాడుకోబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనం వారాహిలో బందరులో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు రానున్నారు. ఇప్పటివరకూ కేవలం వారాహిని పూజల కోసం మాత్రమే బయటికి తీసిన పవన్ కళ్యాణ్ తొలిసారి రాజకీయ కార్యక్రమానికి వారాహిని వాడబోతున్నారు. ఏప్రిల్ నుంచి వారాహిలో రాష్ట్రమంతా తిరగాలని భావిస్తున్న పవన్ దీనికి టీజర్ గా బందరు సభకు తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి :