ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఈ రోజు (శుక్రవారం) అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో సోనియాగాంధీకి చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
గురువారమే సోనియాను ఆస్పత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సోనియాకు పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. గురువారమే సోనియాను ఆస్పత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కాగా, సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా జనవరిలోనూ ఆమె ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. సోనియా గాంధీ కరోనా తరువాత తలెత్తిన పలు సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆమె కొన్నిరోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో వాతావరణ మార్పుల కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. సోనియాగాంధీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఆమె విదేశాలకు వెళ్లి కూడా చికిత్స తీసుకున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ 85ప్లీనరీ వేడుకల్లో సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌పై తనకు గట్టి నమ్మకం ఉందన్న సోనియాగాంధీ. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004,2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇక భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుందన్న సోనియా ఆ యాత్ర కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి :