తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ కౌంటర్ ఇచ్చిన సినీ ప్రముఖులు

Tammar eddy Bharadwaja's shocking comments countered by film personalitie

 

RRR: తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ కౌంటర్ ఇచ్చిన సినీ ప్రముఖులు

దర్శకుడు ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి  ఇద్దరు స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం) ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ఆస్కార్ రేసులో నిలిచి సత్తా చాటింది. ఇలాంటి చిత్రంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులనూ దక్కించుకుంది. అంతేకాకుండా ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది. RRR మూవీ ఆస్కార్‌ అవార్డుకు నామినేట్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు గర్వపడుతున్నారు. ఈ నేపద్యంలో  RRR మూవీపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను చాలా మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులువ్యతిరేకించారు . అలాగే సినీ ప్రియులు సైతం ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ అంశం ఇప్పుడు సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

తమ్మారెడ్డి భరద్వాజ RRR మూవీపై చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘ఇది ఎవరైతే అన్నారో వాళ్లకు మాత్రమే RRRకు ఆస్కార్ కోసం నీయమ్మా మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు? (RRR మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం)’ అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యాలు దూమారాన్ని రేపడంతో ఇదే అంశంపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘మిత్రుడు భరద్వాజకు.. తెలుగు సినిమాకూ, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి’ అని సూచించారు.

అదే ట్వీట్‌లో రాఘవేంద్రరావు ‘RRR మూవీ ప్రచారానికి రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరాన్, స్పిల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా’ అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. దీంతో ఈ అంశం మరింత పెద్ద వివాదంగా మారిపోతోంది.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply