రీఎంట్రీ ఇవ్వనున్న జీవితా రాజశేఖర్‌

Actress Jeevitha Rajasekhar Play Sister Role In Rajinikanth

రీఎంట్రీ ఇవ్వనున్న జీవితా రాజశేఖర్‌

తలంబ్రాలు, జానకి రాముడు, అహుతి, అంకుశం, మగాడు తదితర హిట్‌ ల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన జీవితరాజ శేఖర్ . చివరగా 1990లో మగాడు లో కనిపించిన ఆమె అందులో హీరోగా యాక్ట్ చేసిన రాజశేఖరను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. ఇద్దరు కూతుళ్ల పెంపకంతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండిపోయారు. అయితే సినిమా లపై ఉండే మక్కువతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలుసినిమాలు తెరకెక్కించారు. భర్త రాజశేఖర్ హీరోగా శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ లని జీవితనే డైరెక్ట్ చేశారు. అయితే సుమారు 33 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా ల్లో నటించేందుకు రెడీ అయ్యారు జీవిత. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏకంగా సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారామె. ‘లాల్‌సలాం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లో జీవిత రాజశేఖర్‌ సోదరిగా నటించనున్నారు. మార్చి 7న ఈ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈసినిమా కు రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. గతంలో ధనుష్‌, శ్రుతిహాసన్‌ కాంబినేషనల్‌ వచ్చిన 3సినిమా కు ఐశ్వర్యనే దర్శకత్వం వహించారు. అలాగే ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. కాగా లాల్‌సలాం చిత్రంలోని ప్రధాన పాత్రలకు వెల్కమ్‌ చెబుతూ మూవీ యూనిట్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఇందులో రజనీకాంత్‌, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్‌ ఫొటోలను షేర్‌ చేశారు. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply