స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌ బుక్ చేయండి ఏసీ బెర్త్‌లో ప్రయాణం చేయండిలా

Indian Railways

స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌ బుక్ చేయండి ఏసీ బెర్త్‌లో ప్రయాణం చేయండిలా

త్వరలో సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కదా. ఈ వేసవి సెలవుల్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్నారా?  సొంతూళ్లకు వెళ్లేందుకు లేదా టూర్లకు వెళ్లేందుకు  రైలు టికెట్ బుక్ చేస్తున్నారా?  అయితే భారతీయ రైల్వే అందిస్తున్న ఓ అద్భుతమైన ఫీచర్ ఉపయోగించుకోవచ్చు సులభంగా.  మీరు స్లీపర్ క్లాస్ రైలు టికెట్ బుక్ చేసినా ఏసీ బోగీలో ప్రయాణించవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా  ఇందుకోసం మీరు రైలు టికెట్లు బుక్ చేసేప్పుడే ఓ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఆ ఆప్షన్ పేరు ఆటో అప్‌గ్రేడేషన్. భారతీయ రైల్వే చాలాకాలం క్రితమే తీసుకొచ్చిన ఫీచర్ ఇది.  రైల్వే ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసేప్పుడు రైల్వే ప్రయాణికులు  ఆటో అప్‌గ్రేడేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో  తెలుసుకోండి.

గతంలో రైలు బెర్తుల కేటాయింపు పద్ధతి చూస్తే రైల్వే ప్రయాణికులు ఏ కోచ్‌లో బెర్త్ కోరుకుంటే ఆ కోచ్‌లో సీటు లభించేది.  బెర్తులు ఖాళీ లేకపోతే టికెట్ క్యాన్సిల్ అయ్యేది. కానీ భారతీయ రైల్వే ఆటో అప్‌గ్రేడేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా రైల్వే ప్రయాణికులు తాము ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ ఖాళీ లేకపోతే అంతకన్నా హయ్యర్ కోచ్‌లో బెర్త్ పొందొచ్చు. అయితే ఆ కోచ్‌లో బెర్త్ ఖాళీ ఉంటేనే సీటు లభిస్తుంది. అయితే ఇందుకోసం ప్రయాణికులు అదనంగా ఛార్జీలు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

అసలు ఉదాహరణకు ఓ రైల్వే ప్రయాణికుడు స్లీపర్ క్లాస్‌లో రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ఎంచుకున్న ప్రయాణికుడికి స్లీపర్ కోచ్‌లో బెర్త్ ఖాళీ లేకపోతే థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే అవకాశాలు ఉంటాయి.  అయితే థర్డ్ ఏసీ కోచ్‌లో బెర్తులు ఖాళీగా ఉన్నప్పుడే ఈ ఫీచర్ పనిచేస్తుంది.  ఆటో అప్‌గ్రేడేషన్ ఎంచుకుంటే స్లీపర్ టికెట్ బుక్ చేసేవారికి థర్డ్ ఏసీ, థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసినవారికి సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసినవారికి ఫస్ట్ ఏసీ టికెట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే హయ్యర్ కోచ్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అంటే ఈ ఆప్షన్ ఎంచుకున్న రైల్వే ప్రయాణికుల్లో ముందుగా ఆప్షన్ ఎంచుకున్నవారికి మాత్రమే హయ్యర్ బెర్త్ లభించే అవకాశాలు ఎక్కువ.

ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ప్రయాణికుల వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత రైల్వే ప్రయాణికులు ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫీచర్ పనిచేస్తుంది  రైలు టికెట్లు బుక్ చేసిన ప్రతీసారి ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.  ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి అనేక మంది రైల్వే ప్రయాణికులు స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై థర్డ్ ఏసీ రైలు ప్రయాణం చేస్తున్నారు.  ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసేవారికి మాత్రమే ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఉంటుంది రైలు కౌంటర్లలో బుక్ చేసే టికెట్లకు ఈ ఫీచర్ పనిచేయదు మరి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh