Hyderabad: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? పోలీసుల నుంచి మీకో అలర్ట్.. ఇప్పుడే తెలుసుకోండి..

మీరు సంక్రాంతి జరుపుకోబోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తాళం వేసినా కొన్ని చిట్కాలు పాటించాలని సూచించారు. ఇంతకీ, పోలీసులు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటి?

సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఇంటికి తాళం వేసినా కొన్ని టిప్స్‌ పాటించాలని సూచిస్తున్నారు. ఇంతకీ, పోలీసులు చెబుతోన్న జాగ్రత్తలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. Sankranthi పండక్కి ఊరెళ్తోన్న హైదరాబాదీలకు జాగ్రత్తలు చెబుతున్నారు పోలీసులు. ఇంటికి తాళం వేసినా కొన్ని టిప్స్‌ పాటించాలని సూచిస్తున్నారు. కేవలం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారో మీ విలువైన వస్తువులు మాయమైపోవడం ఖాయమంటున్నారు.

సంక్రాంతి సీజన్‌లో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని సూచించారు. కావున ఈ సూచనలను పాటించవలసిందిగా కోరుచున్నాము. మీ ఇంటిని పూర్తిగా చీకటిగా ఉంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. లైట్లు ఆర్పేసి, ఇంటికి తాళం వేసి ఉంటే దొంగల బెడద సులువవుతుందని చెబుతున్నారు. కాబట్టి, ఇంట్లో కొన్ని లైట్లు వెలిగించడం మంచిది. బంగారం, డబ్బు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు మీ వద్ద ఉంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకోండి. మీ వాహనాలను ఇంటి ముందు కాకుండా ఇంటి లోపల పార్క్ చేయాలని కూడా సూచించారు.

మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి కాలనీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలతోపాటు పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

హైదరాబాద్‌లో మొదలైన సంక్రాంతి పండుగ రద్దీ..

సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటడంతో నగరం పల్లెలను తలపించింది. నగరంలోని ప్రజలు తమ ఆత్మీయులతో కలిసి పండుగ చేసుకునేందుకు ఇళ్లకు వెళ్లడంతో బస్సు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి పండుగకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన ట్రాఫిక్ టోల్ బూత్‌ల వద్ద ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడటానికి, పంతంగిలోని టోల్ బూత్‌లు 10 అదనపు టోల్ బూత్‌లను తెరవబడ్డాయి మరియు బూత్‌లలోని సెన్సార్‌లు 3 సెకన్ల నుండి 2 సెకన్లకు మందగించబడ్డాయి. దీంతో టోల్ బూత్‌ల గుండా వాహనాలు వేగంగా వెళ్లేందుకు వీలు కలుగుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh