Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.

Cable Bridge కన్నీటిని మిగిల్చిన కేబుల్‌ బ్రిడ్జి.

గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్‌ బ్రిడ్జి కూలిపోయి 60 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. కేబుల్‌ బ్రిడ్జిపై మొత్తం 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మచ్చు నదిపై కొత్తగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనను మూడు రోజుల క్రితం ప్రారంభించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈరోజు తెల్లవారుజాము వరకు 100 మందికి పైగా మరణించినట్లు తేలిందని గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది. కాగా.. ఈ ప్రమాదం నుంచి దాదాపు 177 మందిని రక్షించారు. ప్రస్తుతం 19 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి.

ప్రమాదానికి గురైన కేబుల్‌ బ్రిడ్జి చాలా పురాతనమైనది. వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి. ఈ వంతెనను143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అనాడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.5 లక్షల ఖర్చు చేయగా, బ్రిడ్జికి అవసరమైన సామాగ్రి మొత్తం ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు.

దర్బార్‌ గఢ్-నాజర్ బాగ్‌ను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి పొడవు 765 అడుగులు. దీనికి అధికారులు మూడు రోజుల కిందటే మరమ్మతులు చేపట్టారు. గత రెండేళ్లుగా ఈ కేబుల్ వంతెన మూసివేయగా, గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న మరమ్మతులు చేపట్టి తిరిగి ఓపెన్‌ చేశారు. అయితే, ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పూల్ మహాప్రభుజీ సీటు, సమకంఠ ప్రాంతం మొత్తాన్ని కలుపుతుంది. ఈ కేబుల్ వంతెన గుజరాత్‌లోని మోర్బీకే కాకుండా యావత్ దేశానికి చారిత్రక వారసత్వం.

 2.రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు TS:

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. రూ.5.24 కోట్లు 22 ఖాతాలకు పంపిన లావాదేవీలపై ఈరోజు సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. TRS ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఫిర్యాదుపై ఈసీ రాజగోపాల్ రెడ్డికి ఈ నోటీసు పంపింది.

3.ఓ తలకు మాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు!: చండూరులో కేసీఆర్.

మునుగోడులో యుద్ధం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ నేడు చండూరులో రణభేరి సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ నుంచి దొంగతనంగా వచ్చి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి జైలుపాలయ్యారని అన్నారు. ఓ తలకు మాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు, ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీనిపై ఇంతకుమించి మాట్లాడలేను. నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. నేను మాట్లాడితే దీన్ని ప్రభావితం చేశానని అంటారు.

 

4.రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత? చక్రం తిప్పిన బండి సంజయ్..!

ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను బండి సంజయ్ కోరారు. మునుగోడు పోలింగ్‌కు ముందే సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

రాజాసింగ్‌ ఇచ్చిన వివరణపై బీజేపీ (BJP) హైకమాండ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌కు అన్ని విధాలుగా మద్దతివ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌కు సంబంధించిన కేసుల విషయంతో పాటు పార్టీకి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్‌తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. పార్టీ తరపున రాజాసింగ్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు , మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు న్యాయ సహాయం అందిస్తున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే.. మునుగోడులో బలం పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

5.రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు:

ఒక్క చాన్స్‌ అంటూ గద్దెనెక్కిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుల, మత, ప్రాంతాల వారీగా రాష్ట్రాన్ని విభజిస్తూ అరాచక, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేశాడు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘మూడున్నరేళ్లలో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. 2014-19 మధ్య అప్పులు రూ. 2,57,210 కోట్లు అయితే, వైసీపీ మూడేళ్ల అప్పులు రూ.4 లక్షల కోట్లు దాటా యి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైసీపీకి డిపాజిట్లు రావు’’ అన్నారు.

6.కరెంటు లేకపోయినా Wi-Fi పని చేసే టెక్నాలజీ.

కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అన్ని చోట్లా పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పని, వ్యాపారం కోసం ఇంట్లో ప్రతిదీ చేస్తారు. అదేవిధంగా, ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మవచ్చు. అయితే ఈ పనులన్నీ జరగాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చాలా ముఖ్యం. కానీ కొందరికి వై-ఫై సౌకర్యం ఉంది. కానీ ఈ Wi-Fi సౌకర్యం ప్రతిరోజూ పనిచేయదు.

ఎందుకంటే కొన్నిసార్లు పవర్ కట్ అయినప్పుడు Wi-Fi కూడా ఆఫ్ అవుతుంది. ఈ Wi-Fiలు విద్యుత్ సహాయంతో మాత్రమే పని చేస్తాయి. పవర్ కట్ ఉంటే, Wi-Fi కూడా ఆపివేయబడుతుంది. ఆపై మళ్లీ పవర్ ఆన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే Wi-Fi మళ్లీ ఆన్ అవుతుంది. దీంతో పని చేయడం కష్టమవుతుంది.

మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు చిన్న పని చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.ఈ సమస్యను వదిలించుకోవడానికి ఒక పరికరం మీకు సహాయం చేస్తుంది. ఇది Wi-Fi రూటర్‌తో పనిచేసే మినీ UPS.ఈ పరికరం పేరు జింక్ UPS రూటర్. దీని ధర రూ.2,999. అయితే, ఇది అమెజాన్ నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చు

7.ఫ్లిప్‌కార్ట్ భారీ షాక్.. క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకుంటే.

ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart ) వినియోగదారులకు భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘క్యాష్ ఆన్ డెలివరీ’లకు అదనపు చార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. ఆర్డర్ చేసే వస్తువు ధరతో సంబంధం లేకుండా అన్ని క్యాష్ ఆన్ డెలివరీ(cash on delivery)లకు ఈ రసుమును చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ముందుస్తు చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఫీజు ఉండదు. ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయం ఆన్‌లైన్ షాపర్లను షాక్‌కు గురిచేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లోని వస్తువులను ఆర్డర్ చేసేటప్పుడు వాటి విలువ రూ. 500లోపు ఉంటే రూ. 40 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆర్డర్ విలువ రూ. 500 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఉచితంగా డెలివరీ చేస్తారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇవేవీ హిడెన్ చార్జీలు కావని, సెల్లర్ షాపింగ్ పాలసీపై అదనపు చార్జ్ ఆధారపడి ఉంటుందని తెలిపింది. సెల్లర్‌కు సెల్లర్‌కు మధ్య డెలివరీ చార్జీల్లో తేడా ఉంటుందని పేర్కొంది.

క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల కోసం తాము చార్జ్ చేయడం లేదని పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్.. ఇకపై రూ. 150 లేదంటే రూ. 15,000 విలువైన ఆర్డర్‌ను ‘సీవోడీ’ (cod) కింద ఆర్డర్ చేస్తే డెలివరీ చార్జీలకు అదనంగా రూ. 5 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం కొన్ని నిర్దిష్ట ధర కేటగిరీ కంటే తక్కువ ధర కలిగిన ఉత్పత్తులకు డెలివరీ రుసుము వసూలు చేస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లో లిస్ట్ అయిన ఏ ప్రొడక్ట్‌ విలువైన రూ. 500 కంటే తక్కువ ఉన్నప్పుడు రూ. 40 వసూలు చేస్తోంది. ఆపై ధర ఉండే ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అయితే, ఇప్పుడీ డెలివరీ రుసుమును ఎత్తేసిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఆర్డర్లు అన్నింటికీ హ్యాండ్లింగ్ రుసుముగా రూ. 5 వసూలు చేయనున్నట్టు తెలిపింది. నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్న కారణంగా సీవోడీని ఉపయోగించి చేసే ఆర్డర్లకు నామమాత్రంగా 5 రూపాయలు చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే, ముందస్తు చెల్లింపుల ద్వారా దీనిని నివారించవచ్చని పేర్కొంది.

8.బాలయ్య అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అయిన కుర్ర హీరోలు

నటసింహం నందమూరి బాలకృష్ణలో మరోయాంగిల్ ను బయట పెట్టిన షో ఆహా అన్ స్టాపబుల్. బాలకృష్ణ ఎంత సరదా మనిషో కొందరికే తెలుసు. ఈ షో వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరికి తెలిసింది. ఇక ఈ టాక్ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. తన స్టైల్ లో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. ప్రేక్షకులను అలరించారు బాలకృష్ణ.

మొదటి సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే జోష్ తో సీజన్ 2 ను రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ కు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు రాగా.. రెండో ఎపిసోడ్ కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నల గడ్డ హాజరయ్యారు. ఈ రెండు ఎపిసోడ్ లు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ పై అందరికి ఆసక్తికి పెరిగిపోయింది.

ఈ ఎపిసోడ్ కు మరో ఇద్దరు యంగ్ హీరోలు రానున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఇప్పుడు మరో ఇద్దరు కుర్ర హీరోలు.. శర్వానంద్, అడవి శేష్ హాజరుకానున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ఆహా కొన్ని స్టిల్స్ ను రిలీజ్ చేసింది.

ఈ స్టిల్స్ చూస్తుంటే కుర్రహీరోలతో పోటీగా బాలయ్య ఎనర్జీ కనిపిస్తోంది. శర్వానంద్ ఇటీవల ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకోగా.. శేష్ మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.మరి ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ ఈ ఇద్దరు యంగ్ హీరోలను ఎలాంటి ప్రశ్నలు అడిగారు. ఎలాంటి సరదా సంభాషణ జరిగింది అన్నది తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే. నవంబర్ 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

9.భారత జట్టు ఓటమితో తలపట్టుకున్న పాకిస్తాన్.

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్‌లను ఓడించింది.

దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక మ్యాచ్ వాష్ అవుట్ కావడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌కు చేరుకుంది. ఇక భారత్ గురించి చెప్పాలంటే రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది.

దక్షిణాఫ్రికాకు ఐదు పాయింట్లు, భారత్‌కు నాలుగు పాయింట్లు ఉన్నాయి.గ్రూప్-2లో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh