ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు స్పాట్ డెడ్

A serious road accident took place in Nizamabad district

Nizamabad District :ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చాంద్రాయణపల్లి శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు వెళుతున్న కారు అతివేగంగా ముందున్న భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని, సంఘటనా స్థలంలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ప్రమాదానికి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వాహనాన్ని వేగంగా నడపడమే కారణమని భావిస్తున్నారు. మృతులు నలుగురు పురుషులుగా గుర్తించారు.

ప్రమాద ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసిన పోలీసులు మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

మితిమీరిన వేగం ప్రాణాలనే బలి కోరుకుంటున్నదీ వాహనాలు నడిపేకోల్పోతున్నారు. తటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ, మితిమీరిన వేగంతో ప్రతిరోజు చాలామంది ప్రాణాలు మ కుటుంబాలను శోకసంద్రంలో నెట్టి పోతున్నారు. కనుక వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటే మంచిదని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, పరిమిత వేగంతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply