నేడు విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేసిన సీఎం

 AP:నేడు విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేసిన సీఎం

ఏపీలో విద్యార్థులకు జగన్ సర్కార్  శుభవార్త తీసుకువచ్చింది.  నేడు (ఆదివారం) ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధులను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు.  గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుంచి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లను ఆర్ధిక సాయం అందించింది జగన్ ప్రభుత్వం. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది జగన్ ప్రభుత్వం  ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే  ఈ తోడేళ్లంతా పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయో చెప్పాలంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి జగన్ సినిమాల్లో హీరోలే నచ్చుతారు కానీ విలన్స్ ను కాదంటూ విపక్షాలపై పంచ్‌లు పేల్చారు వైఎస్ జగన్.

ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారు. నేడు 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అందుకే విద్యకు పెద్దపీట వేశార’ని వెల్లడించారు.

అలాగే అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ నేడు తిరువూరులో ప్రారంభిచారు . పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్‌లో చదవాలనేది సీఎం ఆలోచన. సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చార’ని తెలిపారు. అలాగే మాజీ సీఎం చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉందన్నారు. 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. ఏపీ తరహాలో తమ రాష్ట్రాల్లోని స్కూల్స్‌ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయని తెలిపారు ఉదయభాను.  కానీ ఎవరు ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh