పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

gold rate silver ratetoday

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు శుభవార్త  గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా పడిపోతున్నాయి. కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అనేచెప్పాలి. గడిచిన  కొన్ని  రోజుల వ్యవధిలో బంగారం ధర ఒక్కసారి గా పెరగడం గమనార్హం.  ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన సమీపిస్తున్న తరుణంలో రెండు నెలల కనిష్టం వద్ద పసిగి కొనుగోలు దారులకు ఊరనిచ్చే అంశం.

అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో దాదాపు 3500 దిగొవచ్చిన పసిడి ధర ఈ రోజు (మంగళవారం) కూడా అదే బాటలో నడిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో MCXలో బంగారం ధర నేడు 55,000 స్థాయిలో ఉంది. అలాగే వెండి 63,000 వద్ద ట్రేడవుతోంది.

ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.150 తగ్గి రూ.51,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 బలహీనపడి రూ.56,020గా ఉంది. అలాగే కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో,రూ.69000లుగా ఉంది. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధరూ స్వల్పంగా పుంజుకుని రూ.69200 పలుకుతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయింది. జూన్ 2021 నుండి అతిపెద్ద నెలవారీ నష్టానికి దారితీశాయి. సోమవారం రెండు నెలల కనిష్టానికి చేరిన తర్వాత మంగళవారం స్పాట్ బంగారం 0.1శాతం తగ్గి ఔన్సు ధర 1,816.19 డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1శాతం క్షీణించి తగ్గి 1,823.30 డాలర్ల స్థాయికి చేరింది.

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ – రూ.51,450 చెన్నై – రూ. 52,070 ముంబై – రూ. 51,450 ఢిల్లీ – రూ. 51,600 కోల్‌కతా – రూ. 51,450 బెంగళూరు – రూ.51,500

ఇది కూడా చదవండి :

Leave a Reply