ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఐదు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ

Land for jobs scam on Lalu Prasad Yadav

Land For Jobs case :ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఐదు గంటలకు పైగా ప్రశ్నించిన  సీబీఐ

ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ ను ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆయనను  సీబీఐ ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. లాలూ మొదటి కుమార్తె మిసా భారతి నివాసంలో ఉంటున్న లాలూ ప్రసాద్ ఇంటికి సీబీఐ బృందం ఈ ఉదయమే చేరుకుంది. దీనిపై లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి ఏమైనా జరిగితే ఎవ్వరినీ వదలబోనంటూ ఆమె హెచ్చరించారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రోహిణీ ఆచార్య ఇటీవలే సింగపూర్‌లో తన తండ్రికి కిడ్నీ దానం చేశారు. తన తండ్రికి అనారోగ్యంగా ఉన్నా అవినీతిపై ప్రశ్నిస్తున్నారని రోహిణీ ఆచార్య మండిపడ్డారు.

ఈ కేసులో లాలూ దంపతులతో పాటు కుమార్తెలు మిసా, హేమ తదితరుల పేర్లను కూడా ఈ కేసులో సీబీఐ చేర్చింది. 2004 నుంచి 2009 వరకూ రైల్వే మంత్రిగా లాలూ ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అతి చవకగా భూములు కొనుగోలు చేసి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.లాలూ, రబ్రీదేవి, వారి కుమార్తెలు సహా 12 మందిపై 2022 మేలో ఎఫ్ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది. ఇదే కేసులో గత ఏడాది జూలైలో లాలూ సహాయకుడు, మాజీ ఓఎస్‌డీ భోలా యాదవ్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ఆసక్తికరంగా, రాజకీయ దురుద్దేశాలతో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన రెండు రోజుల్లోనే రబ్రీదేవిని సీబీఐ విచారించడం విశేషం. ప్రధానికి రాసిన లేఖలో సంతకం చేసిన ప్రముఖుల్లో లాలూ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూతో సహా, పలువురు విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆ లేఖలో విపక్ష నేతలు ప్రస్తావించడం విశేషం. కేంద్రం ఆదేశాలతోనే దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను టార్గెట్ చేసుకున్నాయనే అనుమానాలకు పలు సంఘటనలతో బలం చేకూరుతోందని విపక్ష నేతలు ఆరోపించారు.

కాగా దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొలుపుతోందనే విపక్షాల ఆరోపణలను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. సీబీఐ స్వతంత్ర సంస్థ అని తన పని తాను చేసుకుపోతోందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఎవరు చేసిన పనికి వారే బాధ్యులు అని వారు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను ఆర్జేడీ నేతలు తోసిపుచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ దాడులు జరుపుతున్నారంటూ విమర్శించారు. రబ్రీదేవి సైతం గత వారం మాట్లాడుతూ, లాలూను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ”మేము ఎక్కడికీ పారిపోవడం లేదు. 30 ఏళ్లుగా మేము ఆరోపణలను ఎదుర్కొంటూనే ఉన్నాం. బీహార్‌లో లాలూను చూసి బీజేపీకి భయం పట్టుకుంది అని రబ్రీ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh