జగన్ కోసం ప్రజలకు చంద్రబాబు పిలుపు

guntur tdp chief chandrababu naidu

జగన్ కోసం ప్రజలకు చంద్రబాబు  పిలుపు

ఏపీ లో ప్రస్తుతం ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ  కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారని చంద్రబాబు అన్నారు. చట్ట ప్రకారం పనిచేస్తే సమాజంలో గుర్తింపు వస్తుందని, కానీ జగన్ మాత్రం ఎన్నికల్లో డబ్బులతో గెలుస్తామన్న ధీమాకు వచ్చారన్నారు.  ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది, అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ప్రజలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని, భయపడకూడదని చంద్రబాబు నాయుడు చెప్పారు.

రాష్ట్రంలో ప్రజలను చైతన్యం చేసే దిశగా తెలుగు దేశం ముందుకు వెళ్తోంది అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకొనే ప్రసక్తి లేదన్నారు. ఆంద్ర లో  ముఖ్యమంత్రి జగన్ కోసం అధికారులు బలి పశువులు కావద్దని పిలుపు ఇచ్చారు. పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రాష్ట్రంలో ఐపీసీ చట్టం కాకుండా వైసీపీ చట్టం ఉందని చంద్రబాబు ద్వజమేతేరు  రాష్ట్రంలో అధికారానికి అడ్డు వచ్చినందుకే వివేకా హత్య జరిగిందని, బాబాయినే చంపిన వ్యక్తి నుంచి రాష్ట్ర ప్రజలకు రక్షణ ఎలా లభిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ఉండే సంపద అంతా తన దగ్గరే ఉండాలనే తాపత్రం జగన్ కు ఉంది అన్నారు. జగన్ మరింత ధనవంతుడు అవుతూనే ఉన్నారని, ప్రజలు మాత్రం మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని పేదల ప్రాణాలను ఫణంగా పెట్టి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దింపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించాలంటే టీడీపీకే సాధ్యమని తెలిపారు. రివర్స్ టెండర్లతో పాలనను రివర్స్ చేశారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో జగన్  అడ్డంగా దొరికారని చంద్రబాబు అన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం ఓ మంచి పరిణామమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో కన్నాకు తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, పదేళ్ల పాటు మంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు.

ఇది కూడా చాడవండి :

Leave a Reply