ఎయిరిండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన డిజిసిఎ

dgca imposes fine air india urination case, Air India Penalties, Air India Urination incident, DGCA fines Air India ₹30 lakh

న్యూయార్క్- ఢిల్లీ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై ముత్ర విసర్జన  చేసిన ఘటనలో దిగ్గజ విమానయాన సంస్థ ఐన ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు శుక్రవారం పేర్కొంది భారత సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ (డిజిసిఎ). గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న పరిణామం అందరికి విదితమే. బిజినెస్ క్లాసు లో ప్రయాణం చేస్తున్న ఒక మహిళ పై తోటి నిందితుడైన శంకర్ మిశ్రా ముత్ర విసర్జన చేసినట్లు తెలుస్తుంది. దాంతో తీవ్రఘటన గా పేర్కొన్న ఎయిర్ లైన్స్ నిందితుడైన శంకర్ మిశ్రాపై నలుగు నెలలు నిషేధం విదించిగా ఆ విమానంలో ఆ రోజు విదులు నిర్వహిస్తున్న కెప్టన్ కు మరియు ఇతర సిబ్బంది పై కూడా వేటు పడింది. కాగా  ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థకు ౩౦లక్షలు, ఏఐ డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ కి రూ.3 లక్షల జరిమానా విదించినట్లుగా డిజిసిఎ పేర్కొంది.

 

ఇవి కూడా చదవండి:  

Leave a Reply