Cricket కీపింగ్ లో దిట్ట..ఫినిష్ చేయడంలో…

Cricket కీపింగ్ లో దిట్ట.. మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో సూపర్.. కానీ టీమ్ కు దూరంగానే..

ఓటమి తర్వాత ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రపంచకప్ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో నలుగురు (కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, అర్ష్ దీప్) మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు.సెమీఫైనల్లో ఓడిన టీమిండియా భారంగా టి20 ప్రపంచకప్ (T20 World cup) 2022 నుంచి వైదొలిగింది.

ఆడిన ప్లేయర్లకు ఎంత బాధ ఉందో అంతకు మించిన బాధ టీమిండియా అభిమానులది.ఓటమి తర్వాత ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రపంచకప్ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో నలుగురు (కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, అర్ష్ దీప్) మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు.ఇక వికెట్ కీపర్లుగా ప్రపంచకప్ కు ఎంపికైన దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. విఫలం అవ్వడంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.అటు డీకే..

ఇటు పంత్ ఒక్క మ్యాచ్ లో కూడా కనీసం 10 పరుగులు చేయలేకపోయారు. నిజాయితీగా చెప్పాలంటే వీరిద్దరి కంటే కూడా సంజూ సామ్సన్ 1000 రెట్టు బెటర్. కానీ, సంజూకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతూనే వస్తుంది .ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు మంచి ఫినిషింగ్స్ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో కార్తీక్ ను టీమిండియాకు మళ్లీ ఎంపిక చేశారు.

ఇక రిషభ్ పంత్ ఐపీఎల్ లో ఆడకపోయినా అతడిని టీంతో కొనసాగిస్తూనే ఉన్నారు. పంత్ గొప్పగా ఆడింది మాత్రం టెస్టులే అని చెప్పాలి.పరిమిత ఓవర్ల క్రికెట్ లో పంత్ చెప్పుకోవడానికి ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా లేదు. పంత్, డీకే తో పోలిస్తే సంజూ సామ్సన్ బెటర్. ఐపీఎల్ లో రాజస్తాన్ ను ఫైనల్స్ వరకు చేర్చాడు. ఇక టీమిండియా తరఫున తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాడుభారత్ తరఫున సంజూ సామ్సన్ చివరగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. అందులో వరుసగా 86 నాటౌట్, 30 నాటౌట్, 2 నాటౌట్ గా నిలిచాడు.

అంతకుమందు న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్ లో 54 పరుగులు చేశాడు. అయినా సంజూ సామ్సన్ ను టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయలేదుసామ్సన్ ధోనిలా మైదానంలో చాలా కూల్ గా ఉంటాడు. ఇక కీపింగ్ లో కూడా సంజూ సామ్సన్ చురుకుగా ఉంటాడు. విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను చూసిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

అయినా సామ్సన్ కు పంత్ కు వచ్చినన్ని అవకాశాలు రావడం లేదు.తాజాగా కివీస్ తో జరిగే టి20, వన్డే సిరీస్ లకు పంత్ ఎంపికయ్యాడు. కానీ, ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కు మాత్రం ఎంపిక చేయలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో మరోసారి సామ్సన్ కు అన్యాయం జరిగేలానే కనిపిస్తుంది.

ఆ అవార్డుకు విరాట్ కోహ్లీనే అర్హుడు.

టీ20 ప్రపంచకప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. తన దృష్టిలో విరాట్ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అని అభిప్రాయపడ్డాడు. ఇక అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది .ఈ రెండు గెలిచిన తొలి ప్లేయర్‌గా సామ్ కరన్ చరిత్రకెక్కాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం 13 వికెట్లు తీసిన సామ్ కరన్..

పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. అయితే సామ్ కరన్ కంటే విరాట్ కోహ్లీనే అద్భుత ప్రదర్శన కనబర్చాడని రికీ పాంటింగ్ అన్నాడు. 98.67 సగటుతో పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీని పట్టించుకోకపోవడం సరికాదని నిర్వాహకులను తప్పుబట్టాడు. పాకిస్థాన్‌తో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్..

క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయమైనదని కొనియాడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ చేసిన తీరు అమోఘమని, అతనికే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. గొప్ప ఆటగాళ్లు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని గొప్పగా ఆడతారు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. ఈ వరల్డ్ కప్ టోర్నీకే హైలైట్. నా వరకూ విరాట్‌ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ టాపార్డర్ ఫెయిల్ అయ్యాక విరాట్ బాధ్యత తీసుకుని ఆడాడు.’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను అసాధారణ బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ.. మొత్తం 6 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు చేసి 296 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఈ ఫీట్ సాధించాడు.

1996, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రెండు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు…

 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత బట్లర్ చేసిన పని వైరల్..

పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతలుగా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన ఆ జట్టు ఈ ఫార్మాట్‌లో రెండో ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో ఆ జట్టు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ చేసిన ఒక పని నెటిజన్ల దృష్టికి వచ్చింది. అది చూసిన అందరూ బట్లర్‌ను మెచ్చుకుంటున్నారు.

ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ సడెన్‌గా రిటైర్ అవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో బట్లర్‌ను కెప్టెన్ చేశారు. సారధిగా భారత్‌తో ఆడిన సిరీస్‌లో బట్లర్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో అతన్ని చాలా మంది విమర్శించారు. కెప్టెన్‌గా పనికిరాడన్నారు. కానీ ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా ప్రపంచకప్ ముద్దాడి చరిత్ర సృష్టించాడు బట్లర్.పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో లక్ష్యం స్వల్పమే అయినా..

కీలక సమయాల్లో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వికెట్లు పడుతున్నా కూడా ప్రశాంతంగా నిలబడిన బెన్ స్టోక్స్ (52 నాటౌట్) జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అతను ఒక ఎండ్‌లో పాతుకుపోవడంతో మొయీన్ అలీ వంటి వారికి ధాటిగా ఆడే అవకాశం దక్కింది. దీంతో ఆ జట్టు విజయం సాధించింది.

విక్టరీ సెలబ్రేషన్స్‌ను ఛాంపేన్ బాటిల్‌తో చేసుకోవడం అనేది చాలా పాశ్చాత్య దేశాలకు అలవాటే. ఇంగ్లండ్ కూడా ఇదే చేసింది. అయితే ముస్లింలు అయిన మొయీన్ అలీ, అదిల్ రషీద్ మద్యం ముట్టరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఛాంపేన్ సెలబ్రేషన్స్‌ కన్నా ముందు తమ జట్టు మొత్తాన్ని పిలిచిన బట్లర్.. ఫొటోలు దిగాడు.

ఆ తర్వాత ఛాంపేన్ గురించి చెప్పి అలీ, రషీద్‌ను పక్కకు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.గతేడాది ఆస్ట్రేలియా టెస్టు సారధి ప్యాట్ కమిన్స్ కూడా ఇలాగే చేశాడు. విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఛాంపేన్ తీసుకురాగానే ఉస్మాన్ ఖవాజాను పిలిచి, పక్కకు పంపించాడు. ఆ తర్వాతనే ఛాంపేన్ బాటిల్ ఓపెన్ చేశాడు. ఇలా క్రికెట్‌కు మతంతో పనిలేదని ఈ ఆటగాళ్లు నిరూపిస్తున్నారు.

బాబర్ ఆజాం పిరికిపందా..పాక్ ఫైనల్ కు చేరడమే గొప్ప… మహ్మద్ షమీ వ్యాఖ్యలు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఆ జట్టు మాజీ పేసర్ మహమ్మద్ ఆమీర్ విమర్శలు గుప్పించాడు. బాబర్ పిరికిపంద చర్యల వల్లనే పాకిస్థాన్ ఫైనల్లో విజయం సాధించలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

దాంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని ఆ జట్టు చేజార్చుకుంది.ఈ ఫలితంపై స్పందించిన మహమ్మద్ ఆమీర్.. బాబర్ ఆజామ్ కెప్టెన్సీని తప్పుబట్టాడు. మైదానంలో కెప్టెన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, అలా కాకుండా భయపడుతూ జట్టును నడిపిస్తే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మహమ్మద్ నవాజ్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని ఆమీర్ తప్పుబట్టాడు.

ఈ టోర్నీలో పాకిస్థాన్ బౌలింగే గొప్పదని, ఎవరూ కూడా పాక్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగలేరని అంగీకరిస్తా. కానీ మహమ్మద్ నవాజ్‌కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో నాకైతే అర్థం కావడంలేదు. భారత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ మాట్లాడుతూ.. మహమ్మద్ నవాజ్ మన మ్యాచ్ విన్నరని చెప్పాడు. కానీ ఆ తర్వాత అతన్ని కేవలం బ్యాటర్‌గా ట్రీట్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇది అతనిపై బాబర్‌కు నమ్మకం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది.కెప్టెన్‌గా ఏం చెబితే అది చేయాలి. పీఎస్‌ఎల్‌లో నవాజ్ తొలి ఓవర్ వేసేవాడు.

ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన సత్తా అతనిది. ఫైనల్లో కూడా అతను కీలక పాత్ర పోషించేవాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో హరీ బ్రూక్ తడబడ్డాడు. ఆ టైమ్‌లో నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే మరింత ఇబ్బంది పెట్టేవాడు. కెప్టెన్ ధైర్యంగా ఉండాలి. నిర్ణయాలు దూకుడు తీసుకోవాలి.’అని ఆమీర్ చెప్పుకొచ్చాడు.ఇక పాకిస్థాన్ ఫైనల్ చేరడమే గొప్పని ఆమీర్ అభిప్రాయపడ్డాడు.

‘మనం ఫైనల్ ఆడడమే చాలా పెద్ద విషయం. ఫైనల్ ఆడేందుకు కావాల్సిన అర్హత మనకు ఉందా? మనం ఫైనల్‌కి ఎలా వచ్చామో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదో దేవుడు కరుణించి, అదృష్టం ఈడ్చి పెట్టి తన్నడంతో ఫైనల్‌కి వచ్చేశాం. పాకిస్థాన్ బ్యాటింగ్ చూసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైంది. గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత సిడ్నీ నుంచి టీమ్ వచ్చినప్పుడే ఇలా జరుగుతుందని ఊహించా… ఏదో లక్కీగా సెమీ ఫైనల్ గెలిచారు. అక్కడ ముందు బ్యాటింగ్ చేసినా ఇంటి బాట పట్టేవారు.అని అన్నాడు షమీ.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh