December 4, 2022

తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. వరుడు ముంబైకి చెందినవాడని, ఓ వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోబోతున్నందున కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తన తల్లిదండ్రులే నిర్ణయిస్తారని తమన్నా చాలా సార్లు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారు ఫిక్స్ చేసిన అబ్బాయికి ఓకే చెప్పినట్లు సమాచారం.

కాగా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తమన్నా పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇతడే అంటూ.. ముంబై బిజినెస్ మాన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే తమన్నా బిగ్ షాట్ ని పట్టిందంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాగా తమన్నా పెళ్లి చేసుకోబోయే అతను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్.. వన్ అండ్ ఓన్లీ సన్ ..అని కోట్లకి అధిపతి అని తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *