Sania Mirza: విడాకుల పుకార్లపై స్పందించిన షోయబ్ మాలిక్

Sania Mirza

విడాకుల పుకార్లపై తొలిసారి స్పందించిన షోయబ్ మాలిక్

Sania Mirza: భార‌త టెన్నిస్ స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్  విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే  ఈ పుకార్లు రావడానికి కారణం లేకపోలేదు  ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి రాకపోవడం సానియా మీర్జా రిటైర్మెంట్ ఈవెంట్​లో షోయబ్​ మాలిక్ కనిపించకపోవడంతో రూమర్స్ నిజమేనని అందరూ అనుకున్నారు.

 వీరు పెట్టిన సందేశాలు వలనే  అనుమానాలకు కారణం 

దాదాపు 12 ఏళ్ల Sania Mirza, షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నారు. 2010లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. శత్రుదేశాల వారు కాబట్టి వీరి బంధం విమర్శలు, వివాదాలను సృష్టించారు.

ఇద్దరూ ప్రొఫెషనల్‌ క్రీడాకారుల కావడంతో దుబాయ్‌లో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసి అక్కడే ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వీరికి కొడుకు పుట్టాడు.

ఇజాన్‌ అని పేరు పెట్టుకున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు వేడుకను తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకొన్నప్పుడు పెట్టిన సందేశాలు ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించాయి.

‘నువ్వు పుట్టగానే మేము మరింత వినయంగా మారిపోయాం. జీవితానికి సరికొత్త అర్థం తెలిసింది. మేం బహుశా కలిసుండకపోవచ్చు. ప్రతి రోజూ కలవలేరు.

కానీ నాన్న ఎప్పుడూ నీ గురించి, ప్రతి క్షణం నీ నవ్వు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. దేవుడు నీకు అన్నీ కోరుకుంటున్నా’ అని షోయబ్ మాలిక్ పోస్ట్ చేశాడు. ఇందులో ‘కలిసుండకపోవచ్చు’ అనే పదాలు వీరు విడిపోయారేమో అనే సందేహాలు కలిగించాయి.

సానియా కూడా కొన్ని రోజుల క్రితం ఒక ఫోటో షేర్ చేసింది. ‘నేను కష్టపడ్డ రోజుల్లో బయటపడేసిన మధుర క్షణాలివి’ అని వ్యాఖ్య పెట్టింది. వారం రోజుల క్రితం ‘పగిలిన గుండెలు ఎంతదూరం కలిసి ప్రయాణిస్తాయి’ అంటూ పోస్ట్ చేసింది.

సానియా అండ్ షోయబ్ పెళ్లి వివాదాలు

అటు షోయబ్‌, ఇటు సానియా దాదాపుగా ఒకే తరహాలో వ్యాఖ్యలు పెడుతుండటం వీరిద్దరూ విడిపోయారన్న వదంతులకు బలం చేకూరుస్తోంది.

వీరిద్దరూ విడిపోయేందుకు స్పష్టమైన కారణాలైతే తెలియవు. అధికారికంగానూ వారేం చెప్పలేదు. అయితే కొన్ని రోజుల క్రితం మాలిక్‌ ఓ మోడల్‌ను కలిశాడని, ఆమెతో డేటింగ్‌ చేశాడని పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ దంపతులు విడిపోయారనీ ఏకంగా వార్తలే ఇస్తున్నారని తెలిసింది. కానీ ఈ విషయంపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే  ఇప్పుడు తొలిసారిగా షోయబ్ విడాకుల పుకార్లపై పరోక్షంగా మాట్లాడాడు. భార్య Sania Mirza తో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని షోయబ్‌ మాలిక్‌ అన్నాడు. ‘‘సానియాతో కలిసి ఉండేందుకు ప్రొఫెషనల్‌ ఒప్పందాల వల్ల వీలు దొరకట్లేదు. దీని వల్లే ఇటీవల ఈద్‌కు కూడా కలవలేదు.

మా ఇద్దరిలో ఎవరికి సమయం చిక్కినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటాము. భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు మెరుగవ్వాలని కోరుకుంటున్నా.

ఇప్పటికి కూడా ఐసీసీ దృష్టిలో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచే పెద్దది. భారత్‌-పాక్‌ ఆటగాళ్లే కాదు.. వేరే దేశాల అభిమానులు కూడా ఈ రెండు జట్లు తలపడాలని కోరుకుంటారు’’ అని షోయబ్‌ పేర్కొన్నాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh