Psycho Father : కన్నకూతురిని గొడ్డలితో నరికి

Psycho Father

Psycho Father : కన్నకూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. అసలు కారణం ఇదే ​

Psycho Father : సాధారణంగా అమ్మకు కొడుకు అంటే ఇష్టం నాన్నాకు కూతురు అంటే ఇష్టం అంటుంటారు. కూతరికి ఏ కష్టం వచ్చినా తండ్రి తల్లడిల్లిపోతాడు. ఆడపిల్ల పుట్టింది మొదలు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే వరకు నాన్న పడే శ్రమ అంతా ఇంతా కాదు. తన కూతురికి కాస్త నలత చేస్తేనే తండ్రి తట్టుకోలేడు. నయమయ్యే దాకా మామూలు మనిషి కాలేడు. అంతలా ప్రేమ చూపిస్తాడు తండ్రి.

కానీ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేక 11 ఏళ్ల కూతర్ని కన్నతండ్రే కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు. నిందితుడి పేరు గుండ్ల సదానందం కాగా.. ఇతని చేతిలో చనిపోయిన కూతురి పేరు రజిత. మంథని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సదానందం గతంలో తన భార్యను ఉరి వేసి హత్య చేశాడు. ఈ కేసులో జైలుకి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా చంపి మరో వ్యక్తిపై హత్యాహత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి తీరు పట్ల గ్రామంలో.. ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సందానందంను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. నిందితుడిని తామే శిక్షిస్తామని.. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తోపులాట కూడా జరిగి గ్రామస్థుల ఆగ్రహంతో పోలీస్ వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh