Prabhas: బీజేపీ నుంచి బెస్ట్ ఆఫర్ అందుతోంది

Prabhas: బీజేపీ నుంచి బెస్ట్ ఆఫర్ అందుతోంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలవబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సంతాప కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వస్తున్నారు.
ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు, రాజ్‌నాథ్ సింగ్ మధ్య సమావేశం జరగనుంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా ప్రభాస్ ను కలుస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

నిజానికి ప్రభాస్-అమిత్ షా భేటీని ముందుగా నిర్ణయించారు, అనారోగ్యంతో కృష్ణంరాజు కన్నుమూయడంతో కొంత గందరగోళం నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తారా?

అమిత్ షా హైదరాబాద్ వస్తే.. ఎన్నో ఏళ్లుగా సేవలందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజుకు నివాళులు అర్పించాలి. ఆ క్రమంలో ఎక్కడో ఒక చోట వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటిని కలవాలి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రభాస్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశం హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో జరగవచ్చని అంటున్నారు.
రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా.. ఈ ఇద్దరు ప్రభాస్ ను కలవడంపై దాదాపు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే డబుల్ ధమాకా.! అదే ప్రధాని వెంకట సత్యనారాయణ ప్రభాస్ ని కూడా కలిస్తే. అది ట్రిపుల్ బ్యాంగ్ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ హీరో నితిన్ లను బీజేపీ నేతలు కలిశారు. ఇప్పుడు డార్లింగ్‌తో.

 

ఇంకా చదవండి.
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఆస్కార్ అందుకుంటాడా?
రాబోయే ఎన్నికలపై చంద్రబాబు నాయుడు ప్రకటన

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh